telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

బాలీవుడ్ కు కరోనా దెబ్బ… ఎన్నికోట్ల నష్టమంటే…!?

Bollywood

ప్రపంచ దేశాలను కరోనా వైరస్ వణికిస్తోంది. కరోనా ఎఫెక్ట్ చాలా రంగాలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఇప్పటికే కరోనా ఎఫెక్ట్‌తో టాలీవుడ్, బాలీవుడ్ అనే కాదు.. అన్ని ఇండస్ట్రీస్‌కు సంబంధించిన పెద్ద సినిమాలు రీ షెడ్యూల్ చేయాల్సి వస్తోంది. ఇప్పటికే కరోనా ఎఫెక్ట్ కారణంగా అక్షయ్ కుమార్ ‘సూర్యవంశీ’ సినిమా సహా పలు సినిమాల విడుదల తేదిలు వాయిదా పడ్డాయి. అంతేకాదు దేశ వ్యాప్తంగా అన్ని సినిమాలకు సంబంధించిన షూటింగ్స్ రద్దు చేయబడ్డాయి. ఇప్పటికే కరోనా వైరస్ ఎఫెక్ట్ కారణంగా తెలంగాణ,దిల్లీ, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, కేరళ,కర్ణాటక, పంజాబ్, ఒడిస్సా రాష్ట్రాలు థియేటర్స్‌ బంద్ చేయాలని ఆదేశాలు జారీ చేసారు. దేశ వ్యాప్తంగా దాదాపు 3వేలకు పైగా థియేటర్లు మూత పడ్డాయి. దీంతో బాలీవుడ్ దాదాపు రూ.1000 కోట్ల వరకు నష్టపోయిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. చిత్ర పరిశ్రమపై డైరెక్ట్‌గా ఇన్ డైరెక్ట్‌గా ఆధార పడ్డ చాలా కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడింది. మార్చి 6న రిలీజైన టైగర్ ష్రాఫ్, శ్రద్ధా కపూర్‌ల ‘భాఘీ3’ కరోనా ఎఫెక్ట్‌లో కూడా దాదాపు రూ.100 కోట్లకు పైగా రాబట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఒకవేళ కరోనా ఎఫెక్ట్ లేకుండా ఉంటే దాదాపు రూ.200 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టేదని చిత్ర దర్శకుడు అహ్మద్ ఖాన్ పేర్కొన్నారంటే పరిస్థితి ఎలా ఉందదనేది స్పష్టమవుతుంది. ఇక ఇర్ఫాన్ ఖాన్ నటించిన అంగ్రేజి మీడియం కూడా మూడు రోజుల్లోనే రూ.60 కోట్లకు పైగా వసూలు చేసింది. తాజాగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు థియేటర్స్ మూసివేయాలని తీసుకున్న నిర్ణయంతో ఈ సినిమాలు దారణంగా నష్టపోతున్నాయి. ఈ థియేటర్స్ బంద్ కారణంగా ‘భాఘీ 3’ చిత్ర నిర్మాతలకు దాదాపు రూ.30 కోట్ల వరకు నష్టం వాటిల్లింది.ఈ ఎఫెక్ట్ అంగ్రేజీ మీడియం సినిమాపై పడింది. మరోవైపు హాలీవుడ్‌లో కూడా జేమ్స్ బాండ్, ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ కూడా కరోనా ఎఫెక్ట్ కారణంగా విడుదల వాయిదా పడ్డాయి. మొత్తానికి ఇండస్ట్రీకి కరోనాతో దాదాపు రూ. 1000 పైగా నష్టాలు వాటిలినట్టు చెబుతున్నారు.

Related posts