telugu navyamedia
సినిమా వార్తలు

ఉత్కంఠ రేపుతున్న‌ ‘కిన్నెరసాని’ ట్రైలర్​..

విజేత సినిమాతో హీరోగా తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ ..తాజాగా ‘కిన్నెరసాని సినిమాలో న‌టిస్తున్నారు. క్రైమ్‌, సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో రవీంద్రవిజయ్‌ కీలకపాత్ర పోషించారు.

Kinnerasani First Glimpse: Mega Alludu Searches For Light - Movie News

తాజాగా ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ వదిలింది చిత్ర బృందం. ఈ సినిమా నుంచి ట్రైలర్ గురువారం​ విడుదలై ఆకట్టుకుంటోంది. “నీ ముందు ఉన్న సముద్రం అలలు చూడు. కోపగించుకుని సముద్రాన్ని వదిలి వెళ్ళిపోతున్నట్టు ఉన్నాయి. కానీ సముద్రం వాటిని వదలదు. వదులుకోలేదు నేను అంతే”అంటూ కథానాయిక శీతల్ చెప్పే డైలాగ్ తో ప్రారంభమైన ఈ ట్రైలర్ ఆద్యంతం ఉత్కంఠగా సాగింది.

ముఖ్యంగా కళ్యాణ్ దేవ్, రవీంద్ర విజయ్ ల నటన ఆకట్టుకునేలా సాగింది. మొత్తానికి పూర్తి భిన్నమైన కాన్సెప్ట్ తో కళ్యాణ్ దేవ్ కొత్తగా కనిపిస్తున్నాడు. 

రమణతేజ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అన్షీతల్ హీరోయిన్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. మహతి స్వర సాగర్​ సంగీత మందిస్తున్నారు. సినిమాను వచ్చే ఏడాది జనవరి 26న విడుదల చేయనున్నారు.

Related posts