telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

రైతులకు కేంద్రం గుడ్ న్యూస్

Modi bjp

ఇండియాలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ తగ్గుతూ వస్తున్నాయి. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతున్నాయి.  ఈ కష్టకాలంలో రైతులకు మోడీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. డీఏపీ ఎరువులపై సబ్సిడీ పెంచుతూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో ఎరువుల ధరలపై ప్రధాని నరేంద్రమోడీ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా.. డీఏపీ ఎరువులపై సబ్సిడీ 140% పెంచుతూ నిర్ణయం తీసుకుంది కేంద్రం. గతంలో డీఏపీ సంచికి రూ. 500గా ఉన్న సబ్సిడీని రూ.1200కు పెంచింది కేంద్రం. ఈ సబ్సిడీ కోసం రూ. 14,775 కోట్ల రూపాయలను అదనంగా ఖర్చు చేయనుంది కేంద్ర ప్రభుత్వం. అంతర్జాతీయంగా ధరల పెరుగుదల ఉన్నప్పటికీ రైతు పాతరేట్లకే ఎరువులు పొందాలని ప్రధాని మోడీ పేర్కొన్నట్లు సమాచారం. రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని వెల్లడించారు ప్రధాని మోడీ.

Related posts