ఈ రోజు యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు. సోషల్ మీడియా వేదికగా ఎన్టీఆర్ కు ఆయన అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కోవిడ్ సెకండ్ వేవ్ కల్లోలం సృష్టిస్తోంది. ఇలాంటి సమయంలో వేడుకలు జరుపుకోవడం కరెక్ట్ కాదని, అభిమానులు తన పుట్టినరోజు వేడుకలు జరపొద్దని, అవసరమైతే కరోనా బాధితులకు అండగా నిలవాలని కోరారు. ఇక ఇప్పటికే ‘ఆర్ఆర్ఆర్’ నుంచి విడుదలైన ఎన్టీఆర్ లుక్ కు అద్భుతమైన స్పందన వస్తోంది. తాజాగా “ఎన్టీఆర్ 30” మేకర్స్ తారక్ స్టైలిష్ పోస్టర్ ను విడుదల చేస్తూ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. “ఎన్టీఆర్30″ని నిర్మిస్తున్న యువసుధ ఆర్ట్స్ బ్యానర్ నిర్మాతలు ఎన్టీఆర్ స్టైలిష్ లుక్ తో ఆయన అభిమానులను సర్పైజ్ చేశారు. ఈ పోస్టర్ సినిమాలోనిది కానప్పటికీ ఎన్టీఆర్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇక ‘ఆర్ఆర్ఆర్’ నుంచి విడుదలైన లుక్, ఎన్టీఆర్ 30 పోస్టర్స్ లో తారక్ లుక్ డిఫరెంట్ గా ఉంది. “ఎన్టీఆర్30″కి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. నందమూరి తారక రామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా… కళ్యాణ్ రామ్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.
next post