telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మా ఇంట్లో పెళ్లి.. పబ్లిక్ పండుగ కాదు… నిహారిక పెళ్ళిపై నాగబాబు కామెంట్స్

Nagababu

ఇటీవల మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు కుమార్తె నిహారిక పెళ్లి ఫిక్స్ అయ్యింది. ఏపీ పోలీస్ అధికారి కొడుకుతో పెద్ద‌లు మ్యాచ్ ఫిక్స్ చేశారు. ఆగ‌స్టులో ఎంగెజ్మెంట్, వ‌చ్చే ఫిబ్ర‌వ‌రిలో పెళ్లి అనుకుంటున్నారు . తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో నిహారిక పెళ్లి గురించి నాగబాబు ఆసక్తికరంగా స్పందించారు. మీ అమ్మాయి నిహారిక పెళ్లి కూడా ఖాయమైంది. ఆ పెళ్లి సంగతులేంటి? ఎప్పుడు పెళ్లి పెట్టుకుంటున్నారు?” అని యాంకర్ వేసిన ప్రశ్న అడగగా త్వరలోనే నిశ్చితార్థం పెట్టుకుంటామని నాగబాబు చెప్పారు. మా ఇంట్లో పెళ్లి.. పబ్లిక్ పండుగ కాదు కాబట్టి పర్సనల్ గానే ట్రీట్ చేస్తున్నానని ఆయన చెప్పడం గమనార్హం. అయితే కరోనా కారణంగా అట్టహాసంగా పెళ్లి చేయడం కుదరకపోవచ్చని, ప్రభుత్వ నిబంధనలు అనుసరిస్తూనే పెళ్లి చేయాల్సి వస్తుందని నాగబాబు చెప్పుకొచ్చారు. ఇదిలా ఉండగా… టాలీవుడ్ లో పెళ్లి సంద‌డి న‌డుస్తూనే ఉంది. నిఖిల్ ఇటీవ‌లే పెళ్లి చేసుకోగా, త్వ‌ర‌లో నితిన్ కూడా పెళ్లి చేసుకోబోతున్నాడు. క‌రోనా వైర‌స్ ముప్పు ఇప్ప‌ట్లో తీరేది లేదు అని ఫిక్స్ అయ్యాకే సింపుల్ గా అయినా స‌రే పెళ్లి చేసుకుంటున్నారు.

Related posts