telugu navyamedia
సినిమా వార్తలు

“భారతీయుడు-2” నుంచి కాజల్ అవుట్ ?

Kajal

టాలీవుడ్ భామ కాజల్ అగర్వాల్ వరుస సినిమాలతో బిజీగా ఉంది. తేజ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సీత’ చిత్రంతో ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. కాజల్ ప్రస్తుతం ప్రతిష్ఠాత్మక చిత్రం “భారతీయుడు-2″లో నటిస్తోంది. శంకర్, కమల్‌హాసన్ కాంబినేషన్‌లో భారీ బడ్జెట్‌తో వస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. జూన్ 1 నుంచి తాను భారతీయుడు 2 సినిమా సెట్స్‌లో జాయిన్ అవుతానని ప్రకటించింది కాజల్. అయితే ఇప్పటివరకు దీనికి సంబంధించిన వార్త మాత్రం బయటకు రాలేదు. దీంతో చాలాసార్లు వాయిదా పడుతూ సెట్స్‌పైకి వెళ్లిన భారతీయుడు 2 చిత్రం నుంచి కాజల్ తప్పుకున్నదా? అనే వార్త కోలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది. కానీ దీనికి సంబంధించి కాజల్ నుంచి మాత్రం ఎలాంటి ప్రకటన రాలేదు. కాజల్ ప్రస్తుతం జయం రవితో కలిసి “కోమలి” చిత్రంలో నటిస్తోంది. దీంతోపాటు సుధీర్‌వర్మ, శర్వానంద్ కాంబినేషన్‌లో వస్తున్న “రణరంగం” సినిమాలో కూడా నటిస్తోంది. ఈ రెండు ప్రాజెక్టు ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకురానున్నట్లు సమాచారం.

Related posts