telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సుశాంత్ సోదరి ఎమోషనల్ పోస్ట్… “రక్షాబంధన్ మేరా స్వీట్ సా బేబీ…”

Sushanth

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ ఆత్మహత్య బాలీవుడ్ లో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తున్న విషయం తెలిసిందే. సుశాంత్ సోదరి తాజాగా మరో ఎమోషనల్ పోస్టు షేర్ చేశారు. అన్నా చెల్లెళ్లు, అక్కా తమ్ముళ్ల ప్రేమ బంధానికి ప్రతీకగా నిలిచే రక్షాబంధన్‌ సందర్భంగా శ్వేతాసింగ్ కీర్తి ఓ పోస్టు పెట్టారు. రాఖీ పర్వదినం సందర్భంగా సుశాంత్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. రాఖీ శుభాకాంక్షలు..నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాం..నువ్వు ఎప్పటికి మాకు గర్వకారణమే అంటూ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా పాత జ్ఞాపకాల ఫోటోలను షేర్ చేశారు. ‘హ్యాపీ రక్షాబంధన్ మేరా స్వీట్ సా బేబీ…బహుత్ ప్యార్ కర్తే హై హమ్ ఆప్కో జాన్…ఔర్ హమేషా కర్తే రహెంగే…యూ వర్..ఆర్..యూ విల్..అవర్ ప్రైడ్’ అంటూ శ్వేతా సింగ్ కీర్తి రాశారు. సోషల్ మీడియా ద్వారా సుశాంత్ సోదరి శ్వేతాతోపాటు మరో సోదరి నీతూ సింగ్ కూడా గతంలో సుశాంత్ పై ప్రేమను వ్యక్తం చేశారు. ఇందులో సుశాంత్ చిన్న నాటి ఫోటోలను షేర్ చేశారు. కుర్చీలో కూర్చున్న సుశాంత్‌తో అతని తల్లి అక్కచెల్లెలందరికీ రాఖీ పండగ రోజున డబ్బులు ఇస్తున్న ఫోటోను సుశాంత్ సోదరి శ్వేతా షేర్ చేశారు. ఇందులో సుశాంత్ టీనేజ్‌లో ఉన్న ఫోటో కూడా ఉంది. తన అక్క చేత అతడు రాఖీ కట్టించుకున్న ఫోటోను కూడా శ్వేత సింగ్ తన సోషల్ మీడియాలో షేర్ చేశారు.

Related posts