telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

7 సంవత్సరాల క్రితం ఇదే రోజు “బాహుబలి” మొదలైంది…

Bahubali

తెలుగు చలన చిత్ర స్థాయిని పెంచిన చిత్రం ‘బాహుబలి’. బాలీవుడ్ లో కూడా ఈ చిత్రం కలెక్షన్ల సునామీ సృష్టించింది. ‘బాహుబలి’ చిత్రం మొదలై నేటికి (జూలై 6) 7 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ విషయం తెలుపుతూ బాహుబలి మొదలైన రోజు నాటి ఫొటోలను ‘బాహుబలి’ టీమ్ ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. ‘‘6 జూలై, 2013 బాహుబలి చిత్రం ప్రారంభమైన క్షణం. 7 సంవత్సరాల క్రితం ఇదే రోజు మేము బాహుబలి చిత్ర షూటింగ్‌ని మొదలెట్టాము..’’ అని బాహుబలి టీమ్ ట్విట్టర్‌లో పేర్కొంది. దీంతో అభిమానులు ఈ చిత్రం ఫొటోలను షేర్ చేస్తూ.. టీమ్‌కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Related posts