telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

న్యూ లుక్ తో అదరగొడుతున్న విమలారామన్

Vimalaraman

తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలైన బ్యూటీ విమలారామన్ తాజాగా తన ట్విట్టర్ అకౌంట్‌లో రెండు ఫొటోలను షేర్ చేసింది. ఈ ఫొటోలలో తన లుక్ చూసిన వారంతా ఆశ్చర్యపోతున్నారు. ఆ మధ్య కాస్త బొద్దుగా తయారైన ఈ భామ ఇప్పుడు స్లిమ్‌గా తయారైంది. ఈ ఫొటోలలో ఆమె లుక్ చూసిన వారంతా ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే స్లిమ్‌గా తయారవ్వడమే కాకుండా చాలా పొడవుగా కూడా ఆమె కనిపిస్తుంది. తన హైట్ గురించి చెబుతూనే ఆమె ఈ ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆమె చేతిలో ఏం సినిమాలు లేవు కానీ, ఈ లుక్ చూస్తే మాత్రం త్వరలోనే ఆమెను అవకాశాలు వరించడం ఖాయం అన్పిస్తోంది. తెలుగులో ఎవరైనా ఎప్పుడైనా, గాయం 2, రాజ్, చుక్కలాంటి అమ్మాయి చక్కనైన అబ్బాయి లాంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది విమలారామన్.

Related posts