telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఆ చావు వల్ల కొన్ని వారాల పాటు నరకం అనుభవించా : సమంత

Samantha

టాలీవుడ్ లో అందమైన కపుల్ అక్కినేని నాగచైతన్య, సమంత. వీరిద్దరూ ఈ ఏడాది “మజిలీ” సినిమాతో హిట్ అందుకున్నారు. వీరి సినిమాల విషయం అలా ఉంచితే… ఈ జంట రెండు అమెరికన్ పిట్ బుల్స్‌ను పెంచుకుంటున్న సంగతి తెలిసిందే. వాటి పేర్లు హష్ అక్కినేని, డ్రోగో అక్కినేని. ఇటీవల సమంత, నాగ చైతన్య హష్ తొలి పుట్టినరోజును ఘనంగా సెలబ్రేట్ చేశారు. తన ఫ్రెండ్స్‌ని పిలిపించి గ్రాండ్‌గా పార్టీ ఏర్పాటు చేశారు. అయితే హష్, డ్రోగో కంటే ముందు సమంత బూగబూ అనే కుక్క పిల్లను పెంచుకునేదట. ఆ విషయాన్ని గుర్తుచేసుకుంటూ సమంత ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ సుదీర్ఘమైన ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. “వీడియోలో మీరు చూస్తున్న కుక్కపిల్ల హష్ కాదు. దాని పేరు బుగాబూ. దీనిని ఇంటికి తెచ్చుకోవడానికి ముందు కుక్కల్ని ఎలా పెంచాలో 30 రోజుల పాటు కోర్స్ తీసుకున్నాను. నాకు జీవితాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో తెలిసింది కాబట్టి కుక్క విషయంలోనూ అలాగే ఉండాలని అనుకున్నాను. కానీ నేను నిజానికి చాలా దూరంలో ఉన్నానని తక్కువ సమయంలోనే తెలిసింది. బుగాబూని ఇంటికి తెచ్చుకున్నప్పుడు దానికి పార్వో అనే వైరస్ సోకిందని తెలిసింది. ఇంట్లోకి వచ్చిన నాలుగు రోజుల్లోనే అది చనిపోయింది. ఆ సమయంలో నేను గుండె పగిలేలా ఎంతగా ఏడ్చానో నాకు ఇప్పటికీ గుర్తే. దాని చావుకు నేనే కారణం అనుకున్నాను. ఇంకెప్పుడూ మరో కుక్కను తెచ్చుకోకూడదు అనుకున్నాను. ఈ ఘటన జరిగిన నెల రోజుల తర్వాత చై మరో కుక్కను తెచ్చుకుందాం అన్నాడు. చైకి నాకంటే అన్నీ బాగా తెలుసు కాబట్టి ఓకే అన్నాను. అప్పుడు హష్ ఇంటికి వచ్చింది. అయితే బుగాబూకి పార్వో అనే వైరస్ సోకినప్పుడు ఆ వ్యాధి గురించి రీసెర్చ్ చేశాను. అది ఒక్కసారి ఇంట్లోకి వస్తే నెలలు పాటు అలాగే ఉంటుందట. దాంతో హష్‌కి కూడా అంటుకుంటుందేమోనని ఆ వైరస్ పోవడానికి వెటర్నరీ డాక్టర్‌ను, డాగ్ ట్రైనర్‌ని, నా స్నేహితులను టార్చర్ పెట్టాను. హష్ ఇంటికి వచ్చిన కొన్ని వారాల పాటు నరకం అనుభవించా. పీడ కలలు వచ్చేవి. హష్‌కి ఏమన్నా అవుతుందేమోనని రాత్రిళ్లు ఏడుస్తూ ఉండేదాన్ని. మొత్తానికి హష్‌కు ఏడాది నిండింది. ఇప్పుడు మీకు అర్థమైందా.. హష్ తొలి బర్త్‌డే రోజున నేను ఎందుకు ఇంతగా ఎగ్జైట్ అవుతున్నానో. నేను ఏం చెప్పాలనుకున్నానంటే.. మన లైఫ్ ఎప్పుడూ మన కంట్రోల్‌లో ఉండదు. కాబట్టి మీరు మీ చేతుల్లో లేని దాని గురించి ఆలోచించకండి’ అని పేర్కొన్నారు. ఈ పోస్ట్‌పై బాలీవుడ్ నటి అనుష్క శర్మ హార్ట్ సింబల్‌తో రియాక్ట్ అయ్యారు. అనుష్కకు కూడా కుక్కలంటే చాలా ఇష్టం. కుక్కల కోసం ముంబైలోని శివారు ప్రాంతంలో ఓ షెల్టర్ కట్టించాలని అనుకుంటున్నట్లు వెల్లడించారు.

 

View this post on Instagram

 

The 1st video and 2nd photo isn’t Hash .. he was Bugaboo.. I did a 30 day course on how to raise a dog and thought I was fully prepared ..just like I had complete control over my life I thought it would be the same with raising this puppy .. but I was far from correct .. Bugaboo came with the Parvo virus and died within four days of him coming home . I remember crying so hard I rolled from the dining to the entrance of our apartment, blaming myself and promising I wouldn’t get another dog ……. A month or so later Chay started bringing up the topic of another dog because as always Chay knows best … and on one occasion when I was in a particularly good mood I gave in … he found Hash for me ❤️ … I read that Parvo is a hardy virus and can live in your house months after.. I cleaned and cleaned like a crazy person annoying every vet , dog trainer , friends with dogs who I knew .. asking them If I had done enough to get this out of the house .. when Hash finally came the first few weeks were the most difficult ..I had nightmares .. I kept crying .. always expecting the worst .. now you can see why his 1st birthday means so much to me .. what I mean to say is… You can never be completely in control and you shouldn’t try to be .. don’t be so hard on yourself when something bad happens .. and most importantly Try again .. Happy first birthday Hash and congratulations to me for allowing myself to be happy ❤️

A post shared by Samantha Akkineni (@samantharuthprabhuoffl) on

Related posts