telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సరదాగా చేశాను… సీరియస్ అయిపోకండి… పవన్ ఫ్యాన్స్ కు రఘు కుంచె రిక్వెస్ట్

Palasa

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తున్న వేళ మన దేశంలో లాక్ డౌన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా నెటిజన్లకు వినోదం అందిస్తున్నారు. సింగర్‌గా, మ్యూజిక్ డైరెక్టర్‌గా అందరికీ పరిచయమున్న రఘు కుంచె.. ‘పలాస 1978’ చిత్రంతో నటుడిగా అరంగేట్రం చేశారు. తాజాగా ఆయన తన ట్విట్టర్‌లో పవన్ కల్యాణ్ ‘తీన్‌మార్’ చిత్రంలోని ఓ డైలాగ్‌ ఇష్టమని చెబుతూ.. ఆ డైలాగ్ ప్లే అవుతుంటే తన వాయిస్‌తో సింక్ చేసే ప్రయత్నం చేశారు. ‘‘పవన్ కల్యాణ్‌గారి మూవీస్‌లో నాకు ఎందుకో ‘తీన్‌మార్’ ఫిల్మ్ చాలా చాలా ఇష్టం. అందులో ముఖ్యంగా ఈ డైలాగ్ ఒకటి భలే ఇష్టం. అందుకే సరదాగా.. ‘పవర్‌స్టార్’గారి డైలాగ్ టైమింగ్‌కి సింక్ చేయడానికి ట్రై చేశా.. సరదాగా తీసుకోండి. సీరియస్ అయిపోకండి’’ అని ట్వీట్ చేసిన ఆయన పవన్ డైలాగ్‌ను దాదాపు సింక్ చేసి చూపించారు. ‘‘మనకి జ్వరం వచ్చినప్పుడు అమ్మ కావాలనిపిస్తుంది. భయం వేసినప్పుడు నాన్న ఉంటే ధైర్యంగా ఉంటుంది. బాధలో ఉన్నప్పుడు పక్కన ఫ్రెండ్ ఉంటే బాగుంటుంది. మరి ఆనందంగా ఉన్నప్పుడు పక్కన ఎవరుంటే బాగుంటుందంటావ్.. ఏంటి ఆలోచిస్తావ్.. మనం ప్రేమించినోడు ఉంటే బాగుంటుంది…’’ అని పవన్ తీన్‌మార్‌లో చెప్పే డైలాగ్‌ను ఈ వీడియోలో ఆయన సింక్ చేశారు.

Related posts