telugu navyamedia
సినిమా వార్తలు

మాస్ మహారాజ రవితేజ బాలీవుడ్ ఎంట్రీ..

మాస్​ మహారాజా రవితేజ నటిస్తున్న‌ తాజా చిత్రం ‘ఖిలాడి. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఫిబ్రవరి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. విభిన్నమైన క్రైమ్‌ థ్రిల్లర్‌ కథాంశంతో రూపొందుతోన్న ఈ సినిమాలో ర‌వితేజ డ్యూయల్ రోల్ పోషిస్తున్నారు. ఇందులో ర‌వితేజ‌కు జ‌త‌గా మీనాక్షీ చౌదరి, డింపుల్ హయతి న‌టిస్తున్నారు.

ఈ చిత్రాన్ని హిందీలోనూ విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం. ‘ఖిలాడి’ నిర్మాణ సంస్థల్లో ఒకటైన పెన్ స్టూడియోస్‌ బాలీవుడ్ ప్రొడక్షన్ హౌసే. ఏ స్టూడియోస్‌తో సంయుక్తంగా చిత్రాన్ని నిర్మిస్తోంది. హిందీలో పెన్ స్టూడియోస్‌కు భారీ నెట్‌వ‌ర్క్ ఉంది. సినిమా మీద నమ్మకంతో హిందీ వెర్షన్‌లో థియేటర్లలో విడుదల చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ సినిమాకు రమేశ్‌వర్మ దర్శకత్వం వహిస్తుండగా.. కోనేరు సత్యనారాయణ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి దేవీశ్రీప్రసాద్‌ సంగీతం సమకూరుస్తున్నారు.

Related posts