telugu navyamedia
సినిమా వార్తలు

హీరో విజయ్ ని కలిసిన ధోనీ ఫొటోలు.. వైరల్‌

కోలీవుడ్‌ స్టార్‌ హీరో విజయ్‌కు టీం ఇండియా మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. విజయ్‌ ప్రస్తుతం నెల్సన్ కుమార్ దర్శకత్వంలో బీస్ట్‌ సినిమా షూటింగ్‌ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. గత కొన్ని రోజులుగా చెన్నైలోని గోకులం స్టూడియోలో దీనికి సంబంధించిన షూటింగ్‌ జరుగుతుంది. అయితే ఓ యాడ్‌ షూటింగ్‌లో భాగంగా ధోనీ సైతం అక్కడే షూట్‌లో పాల్గొన్నట్లు తెలుస్తుంది. దీంతో బీస్ట్‌ సినిమా సెట్‌ను సందర్శించాడు మహేంద్ర సింగ్‌ ధోనీ. ఈ సందర్భంగా ఇద్దరు పలు అంశాలపై మాట్లాడుకున్నారు.దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాల్‌ వైరల్‌ అవుతున్నాయి.

Related posts