telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

కంగనాతో సినిమా అంటే వాళ్ళందర్నీ భరించాల్సిందేనట…!

KAngana-Ranauth

బాలీవుడ్ బోల్డ్ క్వీన్ కంగనా రనౌత్ ఏం మాట్లాడినా, ఏం చేసినా సంచలనమే. ఆమె నోటికి బాలీవుడ్‌లో మహామహులే భయపడుతుంటారు. అందుకే ఆమె ఏం మాట్లాడినా నోరు మెదపరు. అంతేకాదు కంగన రనౌత్‌ డిమాండ్లకు ఒప్పుకున్నవారే ఆమెతో పని చేయగలుగుతారు. జీవితంలో డక్కామొక్కీలు తిని ఈస్థాయికి చేరిన కంగనకు ఇండస్ట్రీలో శత్రువులు ఎక్కువన్న సంగతి తెలిసిందే. దాంతో ఆమె తన జాగ్రత్తలో తానుంటుంది. తన వ్యక్తిగత సిబ్బందిపై ఆమె బాగానే ఖర్చు పెడుతుంది. బౌన్సర్లు కాకుండా తనతో ఎప్పుడూ ఏడెనిమిది మంది బృందం వుంటారు. ఎక్కడికి వెళ్లినా వీరంతా తప్పకుండా తనతో వుండాల్సిందేనంటుంది. వారి ఖర్చులు కూడా నిర్మాతలు భరించాల్సి వస్తుంది. లోకల్‌ షూట్స్‌ అయితే ఫరవాలేదు కానీ అవుట్‌డోర్‌ వెళితే వారందరికీ ఫ్లయిట్‌ టికెట్లు, వసతి సౌకర్యాలు అంటే తడిసి మోపెడవుతుంది. కానీ తనతో సినిమా తీయడానికి వచ్చిన వారికి కంగన ముందుగానే ఇవన్నీ చెబుతుంది. వీటికి ఓకే అన్నవారికే డేట్స్‌ ఇస్తుంది. అగ్ర హీరోలతోనే గొడవలు పెట్టుకుని ఇండస్ట్రీలో పెద్ద తలకాయలతో తలపడిన కంగన రనౌత్‌ తన సెక్యూరిటీ పట్ల ఆమాత్రం కేర్‌ఫుల్‌గా ఉండడం ఓకే గానీ ఆ భారమంతా నిర్మాతలపై వేయడమే భావ్యం కాదంటారు సినీ జనాలు. అయితే ఇదంతా తన రెమ్యూనరేషన్‌లో భాగమని, తన సినిమాలపై నిర్మాతలకి భారీ లాభాలు వస్తాయి కనుక వారికి ఇదేం కష్టం కాదనేది కంగనా వాదన. మొత్తానికి కంగనాకు ఉన్న డిమాండ్ అలాంటిది మరి.

Related posts