telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సైబర్‌ క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించిన దర్శకుడు అజయ్‌ భూపతి… ఎందుకంటే ?

ajay-Bhupathi

నటన, మోడలింగ్‌లో శిక్షణ, అవకాశాలు ఇప్పిస్తామని నమ్మించి వేలల్లో డబ్బులు దోచుకొని కొందరు నేరగాళ్లు ఉడాయిస్తున్నారు. ఈ క్రమంలో ఆ ప్రకటనలను చూసిన కొంతమంది యువతులు నేరుగా దర్శకుడిని సంప్రదించడంతో ఈ తతంగమంతా వెలుగులోకి వచ్చింది. యంగ్ హీరో విజయ్ దేవరకొండ, దర్శకుడు అజయ్ భూపతి పేర్లతో సోషల్ మీడియాలో ప్రకటనలు చేస్తూ యువతను ఆకర్షిస్తున్న వైనం తాజాగా వెలుగు చూసింది. వెంటనే సైబర్‌ క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించిన అజయ్‌ భూపతి తన పేరుపై నకిలీ అకౌంట్లు సృష్టించి మోసాలకు పాల్పడుతున్నారని ఫిర్యాదు చేశారు. ఇక ఇప్పటికే బాన్సువాడ చెందిన కుర్రాడు విజయ్ దేవరకొండ పేరుతో యువతులకు వల వేసి పోలీసులకు చిక్కాడు. తాజాగా అజయ్ భూపతిని కూడా మోసగాళ్లు వాడుకుంటున్నారు. ప్రస్తుతం ఇలాంటి నకిలీ రాయుళ్ల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Related posts