లాక్‌డౌన్ నేపథ్యంలో ఇళ్లకే పరిమితమవడంతో యూత్ తమ క్రియేటివిటీకి పదును పెడుతూ కొత్త కొత్త మీమ్స్, పేరడీలు రూపొందిస్తున్నారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, హాట్ బ్యూటీ పూజా హెగ్డే జంటగా.. త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందిన ఫ్యామిలీ ఎంటర్టైనర్.. ‘అల వైకుంఠపురములో’.. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ అందించిన సాంగ్స్ ఈ సినిమాకి మెయిన్ హైలెట్. ఈ సినిమా లిరికల్ అండ్ వీడియో సాంగ్స్ రికార్డ్ స్థాయి వ్యూస్ తెచ్చుకున్నాయి. అయితే ఈ పాటను సావిత్రి, రేలంగి వంటి లెజెండ్స్‌తో ఈ పాటను పేరడీ చేశారు. ‘మాయాబజార్’ చిత్రంలోని ‘సుందరి నీవంటి దివ్యస్వరూపం ఎందెందు వెదకినా లేదు కదా.. నీ అందచందాలింక నావే కదా’ పాటకు ‘సామజవరగమన’ పేరడీ చేశారు. ఒరిజినల్ పాటాలో రేలంగి, సావిత్రి గార్ల కెమిస్ట్రీ, రేలంగి మూమెంట్స్ అద్భుతంగా ఉంటాయి. ‘మాయాబజార్’ వీడియోకి ‘అల వైకుంఠపురములో’ ఆడియో భలే బాగా కుదిరింది. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
“మాయాబజార్” సామజవరగమన.. pic.twitter.com/bbpKg6Ejcp
— Y.Chandra Sekhar (@chandra99997) April 8, 2020