telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఏపీలో పది పరీక్షలు యథాతథం: మంత్రి సురేష్

suresh adimulapu minister

 ఈనెల 31 నుంచి పదో తరగతి పరీక్షలు యథావిధిగా కొనసాగుతాయని ఏపీ  విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. ఈ రోజు ఆయన అమరావతిలో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా రాష్ట్రంలోని పాఠశాలలు, కళాశాలలు, యూనివర్సిటీలు, కోచింగ్ సెంటర్లు, హాస్టళ్లు మూసివేత నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.

ఇంటర్ పరీక్షలు కూడా ఈనెల 23వ తేదీలోగా పూర్తికానున్నట్లు చెప్పారు. సెలవుల కారణంగా విద్యార్థులు వారి వారి స్వస్థలాలకు వెళ్లేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు కావాల్సిన అన్ని సౌకర్యాలను కల్పిస్తామని చెప్పారు. అనారోగ్యంతో బాధపడుతున్న విద్యార్థులకు వైద్య సౌకర్యం కల్పిస్తున్నామని తెలిపారు.

Related posts