telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

చైనా నుంచి భార‌త్‌కు దిగుమతులు తగ్గాయి: కేంద్ర మంత్రి గోయ‌ల్‌

Piyush goyal

ఆంక్షాల నేప‌థ్యంలో చైనా నుంచి భార‌త్‌కు దిగుమతులు భారీగా తగ్గాయని కేంద్ర వాణిజ్య, పరిశ్రమలశాఖ మంత్రి పీయుష్ గోయల్ ప్ర‌క‌టించారు. రాజ్య‌స‌భ స‌భ్యులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు మంత్రి ఈమేర‌కు రాతపూర్వ‌కంగా స‌మాధానం ఇచ్చారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూలై మ‌ధ్య‌కాలంలో చైనా నుంచి దిగుమతుల వ్యాపారం 16.60 బిలియన్ డాలర్లకు తగ్గినట్టు తెలిపారు.

గతేడాది ఇదే సమయంలో దిగుమతులు23.45 బిలియన్ డాలర్లుగా ఉన్నాయ‌ని పేర్కొన్నారు. ఆత్మనిర్భ‌ర్ భారత్‌, మేక్ ఇన్ ఇండియాను విజయవంతం చేసేందుకు త‌మ ప్ర‌భుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. కరోనా సంక్షోభ సమయంలో ఆత్మనిర్భార్ ప్యాకేజీ కింద రూ. 20 లక్షల కోట్లను కేంద్రం విడుదల చేసింద‌ని వెల్లడించారు.

Related posts