కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోమారు విమర్శనాస్త్రాలు సంధించారు. ప్రతిపక్ష నాయకులను భయభ్రాంతులకు గురిచేసేందుకు దర్యాప్తు సంస్థలను కేంద్రం ఇష్టానుసారంగా వాడుకుంటోందని ఆరోపించారు. కర్ణాటక మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ అరెస్ట్ రాజకీయ కక్ష సాధింపునకు ప్రత్యక్ష ఉదాహరణ అని రాహుల్ వ్యాఖ్యానించారు.
దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పి నాయకులను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తోందని రాహుల్ ఆరోపించారు. ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపించారు. డీకే అరెస్ట్ ముమ్మాటికీ కక్ష సాధింపులో భాగమేనని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.