జమ్మూకశ్మీర్ పై భారతప్రభుత్వ నిర్ణయంతో పాక్ లోపల భీతితో ఉన్నప్పటికీ, పైకి బీరాలు పలుకుతుంది. అయినా ఇండియాను అంతర్జాతీయం దోషిగా చిత్రీకరించాలని చూస్తోంది. ఎన్ని రకాలుగా ఇండియాను భంగపరచాలని చూస్తున్నా.. దానికి విరుద్ధంగా జరుగుతుండటంతో… పాకిస్తాన్ ఇబ్బందుల్లో పడింది. భద్రమండలిలో కాశ్మీర్ సమస్యపై ఫిర్యాదు చేయడంతో ఇండియా సీరియస్ అయ్యింది. పాక్ కు అనుకూలంగా చైనా తప్పించి మరో దేశం సపోర్ట్ చేయకపోవడంతో.. పాకిస్తాన్ డీలా పడింది. భద్రతా మండలిలో కదలికలు తీసుకొచ్చామని పాక్ చెప్తున్నది. ఇది చెప్పుకోదగ్గ పరిణామం అని, ఇండియాపై ఇది విజయం అని చెప్పింది పాక్. కాశ్మీర్ సమస్య అన్నది రెండు దేశాల సమస్య అని, మూడో దేశం జోక్యం చేసుకోబోదని స్పష్టం చేసింది. ఎప్పుడైతే ఇండియాపై పాకిస్తాన్ ఫిర్యాదు చేసిందో అప్పటి నుంచి ఇండియా పాకిస్తాన్ పై సీరియస్ అయ్యింది. మరోవైపు కాల్పుల విరమణను ఉల్లంఘించి కాల్పులు జరుపుతున్న పాకిస్తాన్ పై ప్రతీకారం తీర్చుకుంటోంది ఇండియా. పాకిస్తాన్ పోస్ట్ ను ఇప్పటికే పేల్చివేసింది. దాంతోపాటు ముగ్గురు పాక్ సైనికులు కూడా ఈ కాల్పుల్లో మరణించారు.
ఇకపై పాకిస్తాన్ తో చర్చలు జరపబోమని, భవిష్యత్తులో పాక్ తో చర్చలు జరపాలి అంటే కేవలం పీవోకే గురించి మాత్రమే చర్చలు జరుపుతామని, జమ్మూ కశ్మీర్ విషయంలో పాక్ జోక్యం ఇకపై ఉండదని రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ పేర్కొన్నారు. బాలాకోట్ దాడులు జరగలేదని చెప్పిన పాక్ .. ఇప్పుడు బాలాకోట్ దాడులకంటే పెద్ద దాడులు చేయడానికి ఇండియా సిద్ధం అవుతున్నదని పాక్ ప్రధాని పేర్కొనడం విడ్డూరంగా ఉందని అన్నారు. దీన్ని బట్టి బాలాకోట్ దాడులను పాక్ ఒప్పుకుందని అయన అన్నారు. ఆ దేశం ఉగ్రవాదాన్ని వీడనంతకాలం పాక్ స్థితి అలానే ఉంటుందని రాజ్ నాధ్ సింగ్ పేర్కొన్నారు.
ఆ హీరోల గురించి సంచలన కామెంట్స్ చేసిన మంచు విష్ణు…