telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సినిమాలో నటిస్తున్న వైసీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ

Dharma

విశాఖ జిల్లా చోడవరం వైసీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ తాజాగా ‘మోదకొండమ్మ’ అనే సినిమాలో ధర్మశ్రీ నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ గాజువాకలో జరుగుతోంది. గిరిజనులు ఆరాధించే దైవం మోదకొండమ్మ. ఈ చిత్రంలో పరమశివుడికి, ఆయన తపస్సును భంగం చేయడానికి వచ్చిన మాంత్రికునికి మధ్య సన్నివేశాలను తాజాగా చిత్రీకరించారు. ఈ చిత్రంలో శివుడి పాత్రను ధర్మశ్రీ పోషిస్తున్నారు. ఆయన స్వతహాగా కళాకారుడు కూడా. చిన్న వయసు నుంచి నటనపై ఆయనకు ఆసక్తి ఉంది. తన స్వగ్రామం కేజే పురంలో పలు నాటకాల్లో నటించి జనాల మన్ననలను పొందారు. 2004లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పుడు హైదరాబాదులో జరిగిన సాంస్కృతిక కార్యక్రమంలో అన్నమయ్య పాత్రను పోషించి అప్పటి సీఎం రాజశేఖరరెడ్డి ప్రశంసలు అందుకున్నారు. ఆ తర్వాత కూడా ఎమ్మెల్యేగా ప్రజా కార్యక్రమాల్లో బిజీగా ఉంటున్నప్పటికీ తనలోని కళాపోషణను ఆయన రుజువు చేసుకుంటున్నారు.

Related posts