telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ప్రజలు రోడ్లపైకి వచ్చారంటే ప్రభుత్వం విఫలమైనట్టే: పవన్

pawan-kalyan

ప్రభుత్వం ఏర్పడి ఐదారు నెలల్లోనే ప్రజలు ఇలా రోడ్లపైకి వచ్చారంటే ఆ ప్రభుత్వం విఫలమైనట్టేనని జనసేన అధినేత పవన్ కళ్యాన్ అన్నారు. విశాఖలో లాంగ్ మార్చ్ ర్యాలీ ముగిసిన అనంతరం బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ జగన్ అద్భుత పాలన అందిస్తే తాను వెళ్లి సినిమాలు తీసుకుంటాననిపవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. అసలు వైఎస్ జగన్మోహన్ రెడ్డే కాదు.. సగటు రాజకీయ నాయకులు నిజంగా ప్రజల పట్ల బాధ్యతగా ఉండుంటే తనకు జనసేన పార్టీ పెట్టాల్సిన అవసరం ఉండేదే కాదని పవన్ వ్యాఖ్యానించారు.

సగటు రాజకీయ నాయకుల విధివిధానాలు ప్రజలను ఇబ్బంది పెడుతున్నప్పుడు సామాన్యుల నుంచే నాయకులు పుడతారని చెప్పారు. వైసీపీ నాయకులు అడుగుతున్నాను, 2014లో రాష్ట్ర విభజన జరుగుతున్నప్పుడు తెలంగాణ నడిబొడ్డున కూర్చుని నిలదీసే దమ్ము, ధైర్యం మీకెక్కడుంది? ఆ రోజున నువ్వు మాట్లాడావా? ఆ రోజున జనసేన తన వైఖరి వినిపించింది కాబట్టే తెలంగాణ ప్రజలు మన్ననలు పొందగలిగింది. ఇవాళ తెలంగాణ ఆర్టీసీ కార్మికులు నా వద్దకు వచ్చి సమస్యలు విన్నవించుకున్నారన్నారు. 

Related posts