తెలంగాణ సీఎం కేసీఆర్‌ను ఎదుర్కొనే సత్తా తనకు మాత్రమే ఉందని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ చెప్పారు. సోమవారం పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ఎన్నికల ప్రచారంలో కేఏ పాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..వైసీపీ అధినేత జగన్‌కు ఓటు వేస్తే మోదీ, కేసీఆర్‌కు వేసినట్టేనని కేఏ పాల్ పునరుద్ఘాటించారు.
తనను చూస్తే కేసీఆర్ పారిపోతాడని పాల్ వ్యాఖ్యానించారు. జనసేన గురించి మాట్లాడుతూ.. గుండు గీయించే కాపుకు ఓటేస్తారా? అని ప్రశ్నించారు. పవన్, నాగబాబు అన్నీ ఇస్తామంటున్నారు ఎలా ఇస్తారు? అని ప్రశ్నించారు. పవన్ కల్యాణ్ ధనవంతురాలిని పెళ్లి చేసుకుని వచ్చే కట్నం డబ్బులు తీసుకొచ్చి ఇస్తారా? అంటూ కేఏ పాల్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.