telugu navyamedia
ఆంధ్ర వార్తలు

ఏపీలో మ‌ళ్లీ పెరిగిన క‌రోనా కేసులు..

ఏపీలో క‌రోనా వ్యాప్తి కొన‌సాగుతోంది.. కోవిడ్ సెకండ్ వేవ్ అనంతరం.. రోజూవారీ నమోదయ్యే పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్యలో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. ఒక రోజు పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్యలో పెరుగుదల కనిపిస్తే.. మరో రోజు కరోనా కేసులు, మరణాలు తగ్గుముఖం పడుతున్నాయి.

Drop in new Covid-19 cases continues in Andhra Pradesh- The New Indian Express

కరోనా కట్టడికి లాక్‌డౌన్‌, వ్యాక్సినేషన్‌ ప్రక్రియ అమలు చేయడం వల్ల కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది.  గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 56,720 పరీక్షలు నిర్వహించగా.. 1,365 కేసులు నిర్ధారణ అయిన‌ట్లు బుధ‌వారం సాయంత్రం విడుద‌ల చేసిన హెల్త్ బులిటెన్‌లో రాష్ట్ర వైద్యా రోగ్య శాఖ వెల్ల‌డించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,42,073కి చేరింది. నిన్న క‌రోనా వ‌ల్ల ఎనిమిది మంది మృత్యువాత ప‌డ్డారు.

AP caronavirus: ఏపీలో కొత్తగా 1174 కరోనా కేసులు: పెరిగిన రికవరీ, కర్నూలులో అత్యల్ప కేసులు - Telugu Oneindia

దీంతో రాష్ట్రంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 14,097కి చేరింది. 24 గంటల వ్యవధిలో 1,466 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 20,14,180కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 13,796 యాక్టివ్‌ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 2,78,70,218 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది.

Related posts