telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

లక్కీ భామ రష్మికకు బంగారం లాంటి ఛాన్స్

Rashmika

కన్నడ బ్యూటీ రష్మిక మందన్న ఇటీవలే సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా తో బ్లాక్ బాస్టర్ హిట్ అందుకుంది. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటిస్తున్న సినిమాలో రష్మిక హీరోయిన్ గా ఎంపిక చేసారు. తెలుగుచిత్ర సీమలో హిట్ సినిమాతో అరంగేట్రం చేసి వరుస విజయాలు అందుకుంది. తనదైన నటనతో అందరిని అలరించి లక్కీ బ్యూటీ బిరుదును సంపాదించింది. అయితే సిద్ధార్థ్‌ మల్హోత్రా నటిస్తున్న మిషన్‌ మజ్ను సినిమాతో బాలీవుడ్‌ ఎంట్రీ ఇస్తోంది ఈ భామ. తెలుగుఓ పుష్ప, ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాలతో ఫుల్‌ బిజీ అయిపోయింది రష్మిక.  ఇది ఇలా ఉంటే.. తాజాగా రష్మిక మరో బంపర్ ఆఫర్ కొట్టేసిందట. ఇప్పటికే రెండు బాలీవుడ్ సినిమాలు చేస్తున్న రష్మిక.. తాజాగా మరో సినిమాలో ఛాన్స్ కొట్టేసిందట. ఈ విషయాన్ని స్వయంగా ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌ సెషన్‌లో ఆమె వెల్లడించారు. “ప్రస్తుతం బాలీవుడ్ సినిమాల్లో నటిస్తున్నాను. త్వరలోనే మూడో సినిమా అంగీకరించబోతున్నాను.” అని రష్మిక తెలిపింది.

Related posts