telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

బాలకృష్ణతో క్రాక్ బ్యూటీ రొమాన్స్ ?

మాస్ మహరాజ్ వినిమ క్రాక్ భారీ వసూళ్లు చేసి సంక్రాంతి బరిలో విజయం సాధించాడు. అయితే ఈసినిమా ఊహించని స్థాయిలో వసూళ్లను చేసింది. విడుదల రోజున కాస్త ఆలస్యం అయినా చివరికి మాత్రం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ సినిమా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కింది. అయితే ఈ సినిమాను హిందీలో కూడా రీమేక్ చేయాలిన చూస్తున్న విషయం తెలిసిందే.  ఇది ఇలా ఉండగా.. తన తాజా చిత్రం లోనూ శ్రుతిహాసన్ నే రిపీట్ చేయబోతున్నాడట మలినేని గోపీచంద్. ‘క్రాక్’ హిట్ తో ఏకంగా బాలకృష్ణతో సినిమా చేసే ఛాన్స్ పట్టేశాడు గోపి. మైత్రీమూవీస్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. సినిమాను లాంఛనంగా అరంభించారు కూడా. ‘డాన్ శీను, బలుపు, పండగ చేస్కో’ వంటి సినిమాలతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న గోపీచంద్ బాలకృష్ణ ఇమేజ్ కి సరిపోయేలా ఓ చరిత్రకారుని కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించబోతున్నాడట. పల్నాటి ప్రాంతానికి చెందిన ఆ చరిత్రకారుని కథకి బాలయ్య నూటికి నూరు పాళ్లు యాప్ట్ అంటున్నారు. జులై నుంచి ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్ళనుంది. వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలన్నది దర్శకనిర్మాతల ప్లాన్. ప్రస్తుతం బాలకృష్ణ బోయపాటితో ‘అఖండ’ సినిమా చేస్తున్నారు. జూలైకి ఈ సినిమా పూర్తి కానుంది. ఆ వెంటనే గోపీచంద్ సినిమా షూటింగ్ లో జాయిన్ అవుతారట బాలకృష్ణ. బాలయ్య, శ్రుతిహాసన్ ఫస్ట్ కాంబినేషన్ ప్రేక్షకులను ఎలా అలరిస్తుందో మరి!?

Related posts