telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

బిగ్ బాస్-3 : రాహుల్ బూతు పురాణం… అడ్డంగా బుక్కయ్యాడుగా… పెద్దలకు మాత్రమే…!

Rahul

వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో ‘బిగ్ బాస్’ సీజన్ 3 తెలుగు ముగింపు దశకు చేరుకుంది. ఇంక ఒక్కవారం ఎలిమినేషన్ మాత్రమే ఉంది. ఇప్పటికే రాహుల్ ఫైనల్‌కు వెళ్లిపోయాడు. ఇక వరుణ్ సందేశ్, అలీ రెజా, శ్రీముఖి, బాబా భాస్కర్, శివజ్యోతిల్లో నలుగురు ఫైనల్‌కు చేరుతారు. ఒక్కరు ఈ వారం ఎలిమినేట్ అవుతారు. ఇక నిన్నటి ఎపిసోడ్ లో బాబా భాస్కర్ కూడా ఫైనల్ కు టికెట్ గెలుచుకున్నారు. అయితే ఇప్పుడు రాహుల్ బూతు పురాణానికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రాహుల్ అంతకుముందు ఎవరికీ పెద్దగా తెలియదు. కానీ ఇప్పుడు ఆయన క్రేజ్ పెరిగిపోయింది. బిగ్ బాస్ షో పుణ్యమా అని అందరికీ పరిచయమయ్యాడు రాహుల్. అన్నింటికంటే ముఖ్యంగా పునర్నవితో రిలేషన్ మనోడి గుర్తింపును డబుల్ చేసింది. కానీ ఇప్పుడు మూడేళ్ల కింద చేసిన ఓ పని ఈయనకు చెడ్డపేరు తీసుకొస్తుంది. ఒకప్పుడు ఈయన బిగ్ బాస్ షోను బండ బూతులు తిట్టిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అప్పుడు తెలిసీ తెలియక చేసిందే ఇప్పుడు ఈయన మెడకు చుట్టుకుంటుంది. అసలు ఏం జరిగిందటే.. బిగ్ బాస్ సీజన్ 1లో దీక్షా పంత్ అనే హీరోయిన్ వచ్చింది. అప్పట్లో ఈమెతో మంగమ్మ అనే పాట చేసాడు రాహుల్. ఆ పాటను బిగ్ బాస్ సీజన్ 1లో ప్లే చేసారు. ఆ పాట విన్న తర్వాత ఏంటి పిచ్చి పాట అంటూ అక్కడ అంతా విమర్శించారు. దాంతో అప్పుడు మనోడు బాగానే రియాక్ట్ అయ్యాడు. బండబూతులు తిడుతూ ఓ వీడియో పోస్ట్ చేసాడు. తన పాటనే తిడతారా అంటూ రాయలేని బూతులతో రెచ్చిపోయాడు. మూడేళ్ల కింద ఈయన పోస్ట్ చేసిన వీడియోను ఇప్పుడు బయటికి తీసి రచ్చ చేస్తున్నారు నెటిజన్లు. ఈ వీడియో దెబ్బకి రాహుల్‌ బిగ్‌బాస్‌ విన్నర్ అయ్యే అవకాశం కూడా కోల్పోయేలా కనిపిస్తున్నాడు.

Related posts