telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఓటిటిలో పూరీ సినిమా ?

Romantic

ఆకాష్ పూరి హీరోగా నటించిన “మెహబూబా” సినిమా డిజాస్టర్ కావడంతో ఇప్పుడు ఎలాగైనా తనయుడికి హిట్ ఇవ్వాలనే కసితో కనిపిస్తున్నాడు పూరీ జగన్నాథ్. ‘రొమాంటిక్’ అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. దీని కోసం కథ – స్క్రీన్ ప్లే – మాటలు అందించి కొత్త దర్శకుడు అనిల్ పాడూరికి దర్శకత్వ భాధ్యతలు అప్పగించాడు. ఈ సినిమాని పూరీ కనెక్ట్స్ బ్యానర్ పై పూరీ జగన్నాథ్ – చార్మీ కలిసి నిర్మించారు.ఈ నేపథ్యంలో ‘రొమాంటిక్’ సినిమాని కూడా డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ చేయడానికి పూరీ ప్లాన్ చేస్తున్నారట. తాజాగా ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ వారు పూరీతో సంప్రదింపులు జరుపుతున్నారని టాక్ . అయితే ‘రొమాంటిక్’ లాంటి సినిమా ఇప్పుడున్న సిచ్యుయేషన్ లో ఓటీటీ రిలీజ్ చేస్తేనే లాభాలు వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు చెప్తున్నారు. మరి పూరి ఎలాంటి ఆలోచనలో ఉన్నాడో.

Related posts