తాజాగా బిత్తిరి సత్తి టీవీ 9 ఇస్మార్ట్ వార్తలకు దూరమైన విషయం తెలిసిందే. అయితే ఆయనే రాజీనామా చేసి బయటకు వచ్చేశారని కొందరు అంటుంటే.. యాజమాన్యం తీసేసిందని మరికొందరు అంటున్నారు. అయితే V6 ఛానల్‌లో వేల జీతానికి పనిచేసే బిత్తిరిసత్తికి లకారాల ఆఫర్ రావడంతో తీన్మార్ వార్తల నుంచి జంప్ కొట్టి టీవీ 9లో ఇస్మార్ట్ వార్తలు మొదలుపెట్టిన విషయం తెలిసిందే. అయితే ఓ ప్రోగ్రామ్ విషయంలో తలెత్తిన వివాదం కారణంగా ఆయన్ని టీవీ 9 నుంచి తీసేనట్టు వార్తలు వచ్చినా… బిత్తిరిసత్తి బయటకు వచ్చేయడం ద్వారా ఆయనకు వచ్చిన నష్టం ఏం లేదు అంటూ అతనికి సంబంధించిన జీతం వివరాలను ఓ సీనియర్ జర్నలిస్ట్ పొందుపరుస్తూ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైరల్‌గా మారింది. “జీరో నుంచి హీరోగా ఎదిగిన బిత్తిరి సత్తి తానే పెట్టుబడి పెట్టి సొంతంగా సినిమా తీసేస్థాయికి చేరిన దశలో వీ6ని వదిలేసినా, టీవీ9 తీసేసినా పెద్దగా ఫరక్ పడదు. చేవెళ్ల రవి అలియాస్ బిత్తిరి సత్తి కార్పొరేట్ యాడ్ షూట్‌కి సైన్ చేస్తే ఒక రోజు కాల్షీట్స్‌కి 6 లక్షలు. నెలంతా ఎన్ని ఎపిసోడ్లు చేస్తే మీరిచ్చే జీతం చిన్నబోదా?’ అంటూ ఓ సీనియర్ జర్నలిస్ట్ బిత్తిరిసత్తిపై పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది శ్రీయాజమాన్య కాండ మధ్య అధ్యాయంలోనిది..” అంటూ వైరల్ అవుతున్న ఈ పోస్ట్ ను పూర్తిగా చదవండి.
previous post
నేనెప్పుడూ పవన్ కళ్యాణ్ అభిమానినే : హరీష్ శంకర్