థర్టీ ఇయర్స్ పృథ్వీకి ఇప్పుడు కష్టకాలం నడుస్తోంది. ఎంతో కష్టపడి సినీ పరిశ్రమలో బెస్ట్ కమెడియన్‌గా గుర్తింపు తెచ్చుకుని ఎస్వీబీసీ ఛానెల్ ఛైర్మన్ అయ్యే అవకాశం దక్కించుకున్నారు. కానీ ఓ చిన్న ఫోన్ కాల్ తన జీవితాన్ని అతలాకుతలం చేసింది. ఎస్వీబీసీ ఛానెల్‌లో పనిచేసే ఓ మహిళతో పృథ్వీ అసభ్యకరంగా మాట్లాడటం, ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడం సంచలనం రేపింది. దాంతో ఆయన పదవికి రాజీనామా చేసేశారు. అయితే పృథ్వీ గురించి తాజాగా మరో ఆసక్తికర విషయం బయటికి వచ్చింది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘అల వైకుంఠపురములో’ సినిమాలో పృథ్వీకి ఓ మంచి పాత్ర రావాల్సి ఉందట. కానీ అప్పటికే ఆయన సినీ నటుడు, జనసేనాని పవన్ కళ్యాణ్‌పై, జనసేన పార్టీపై నోటికొచ్చిన కామెంట్స్ చేయడంతో ఆ పాత్ర ప్రముఖ నటుడు హర్షవర్ధన్‌కు దక్కింది. ఈ పాత్ర వల్ల హర్షవర్ధన్‌కు మంచి పేరు వచ్చింది. నెగిటివ్ షేడ్స్, కామెడీ యాంగిల్ ఉన్న ఈ క్యారెక్టర్ పృథ్వీకి దక్కి ఉంటే పరకాయ ప్రవేశం చేసేవారు. అయితే హర్షవర్ధన్ కూడా అయన పాత్రకు న్యాయం చేశారు.