telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు

లేడి బాబాలు కూడా .. తయారయ్యారు బాబోయ్..! సెల్ఫ్ ఎంప్లొఎమెంట్ ఏమో.. !

lady fake babas in action arrested

మేము ఎందులోనూ తీసుపోము .. అంటూ .. దొంగబాబాలుగా మహిళలు కూడా తయారవుతున్న ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. రోగాలు నయం చేస్తానంటూ లక్షలు గుంజింది. అంతేకాదు మీ కుటుంబ సభ్యుల చిక్కులు తొలగిస్తానంటూ ఉన్నకాడికి ఊడ్చేసింది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఏకంగా షిరిడీ సాయి పేరునే వాడేసింది. బాబాతో డైరెక్టుగా మాట్లాడి మీ సమస్యలకు పరిష్కారం చూపుతానంటూ నమ్మించింది. ఆ మాయ లేడీ కిలాడీ చెప్పినదానికి గొర్రెలా తలూపిన బాధితురాలు లక్షలు పోగొట్టుకున్నాక గానీ కళ్లు తెరవలేదు. తనకు తాను దైవాంశ సంభూతురాలిగా ప్రకటించుకున్న ఓ లేడీ బాబా అమాయకురాలిని నట్టేట ముంచింది. చెప్పినదానికి తలూపడంతో గొర్రెలా భావించి అందినకాడికి దండుకుంది. ముంబైలో జరిగిన ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చానీయాంశమైంది. బాధితురాలి బాధను ఆసరాగా చేసుకుని 12 లక్షల 75 వేల రూపాయల వరకు లాగేసింది సదరు ఫేక్ బాబా.

ముంబైకి చెందిన కిరణ్ దారువాలా అలియాస్‌ గురుమ.. దైవాంశ సంభూతురాలిగా చలామణీ అవుతోంది. అమాయకులను బుట్టలో వేసుకుంటూ తన పైత్యాన్ని రుచి చూపిస్తోంది. సమస్యల పరిష్కారానికి దారి చూపుతానంటూ.. బాధితుల నుంచి లక్షలకు లక్షలు గుంజుతోంది. ఆ క్రమంలో ముంబైలోని ఖార్‌ పశ్చిమ ప్రాంతానికి చెందిన 34 ఏళ్ల మహిళ ఇటీవల సదరు బురిడీ బాబాను సంప్రదించారు. అత్తగారి ఆరోగ్యం బాగాలేదని.. ఇంట్లో తరచూ సమస్యలు వస్తున్నాయని.. ఎలాగైనా అవి పరిష్కారం అయ్యేలా మార్గం చూపాలని కోరారు. ఆ మహిళ బాధను అర్థం చేసుకోపోగా.. ఉల్టా ఆమెను మరింత ఇరకాటంలో పడేసింది ఆ లేడీ కిలాడీ. దైవ శక్తులతో సమస్యలు పారిపోయేలా చేస్తానంటూ నమ్మించి మోసం చేసింది. పోయిన జన్మలో నీతో పాటు నీ భర్త పాపాలు చేసిన ఫలితమే ఇప్పుడు అనుభవిస్తున్నారని కల్లిబొల్లి మాటలు చెప్పింది. రోజులు గడుస్తున్నా ఆమె సమస్యలు ఎక్కడ వేసినా గొంగళి అక్కడే అన్న చందంగా ఉండటంతో చివరకు పోలీసులను ఆశ్రయించారు. పూజల పేరుతో తన దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయడమే గాకుండా.. ఫేక్ బాబా అనుచరులు తనపై లైంగికదాడికి పాల్పడ్డారని ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బురిడీ బాబా ఆట కట్టించి అరెస్ట్‌ చేశారు.

Related posts