telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

తెలంగాణాలో.. రోడ్డుపై చెత్త వేస్తె…జరిమానాలు…బాధ్యత వారిదే..

swatch telangana by kcr

స్వచ్ఛ తెలంగాణ, రోడ్డుపై చెత్త, వ్యర్థ పదార్థాలను నిర్దేశిత ప్రదేశంలో కాకుండా.. రోడ్లపై ఎక్కడ పడితే అక్కడ పడవేస్తే ఇకపై జరిమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. చెత్తను ఇలా పడవేసిన వారికి రూ.500 జరిమానా విధించనున్నారు. సింక్‌ నుంచి, మురుగు నీటిని రోడ్డుపైకి వదిలినా, మంచినీటిని కలుషితం చేసినా రూ.500 జరిమానా పడుతుంది. బహిరంగ ప్రదేశాలలో ఇతరులకు ఇబ్బంది కలిగించేలా ప్రవర్తిస్తే రూ.1000, గ్రామ పంచాయతీ స్థలాలను ఆక్రమిస్తే రూ.2000 జరిమానాకు గురవుతారు. ఈ మేరకు పంచాయతీరాజ్‌ చట్టం-2018లో కఠిన నిబంధనలు విధించారు. స్థానిక సంస్థల ఎన్నికలు, లోక్‌సభ ఎన్నికలు ముగిశాక కొత్త పంచాయతీరాజ్‌ చట్టాన్ని పక్కాగా అమలు చేస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదివారం అసెంబ్లీలో ప్రకటించారు.

ప్రస్తుతం పంచాయతీలన్నీ మురికి కూపాల్లా ఉన్నాయని, వీటిని మార్చేందుకు రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా నియమితులైన 9500 మంది జూనియర్‌ పంచాయతీ కార్యదర్శులు నిబంధనల్ని పక్కాగా అమలు చేయాలని అన్నారు. లేదంటే మూడేళ్ల ప్రొబేషనరీ పీరియడ్‌ను రెన్యువల్‌ చేయబోమన్నారు. అవసరమైతే పంచాయత్‌రాజ్‌ శాఖను తన వద్దే పెట్టుకుంటానని సీఎం చెప్పారు. స్థానిక ఎమ్మెల్యేలు కూడా చట్టం అమలుపై దృష్టి సారించాలన్నారు. చట్టానికి విరుద్ధంగా ప్రవర్తించిన వారెవరిపైనైనా చర్యలు తీసుకునేందుకు పంచాయతీరాజ్‌ చట్టంలో వెసులుబాటు ఉందని, పంచాయతీ సర్పంచ్‌, కార్యదర్శితోపాటు ప్రజలు కూడా చట్టానికి అనుగుణంగానే నడుచుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. లేదంటే సర్పంచ్‌ పదవికే ఎసరు వస్తుందని హెచ్చరించారు. చట్టంలో నిర్దేశిత లక్ష్యాల గురించి కూడా ముఖ్యమంత్రి వివరించారు. ముఖ్యంగా హరితహారంలో మొక్కల పెంపకం, వాటిని కాపాడటం, పన్నుల వసూళ్లు వంటి లక్ష్యాలు ఇందులో ఉన్నాయి. పంచాయతీరాజ్‌ చట్టంలోని నిబంధనల్ని విస్మరిస్తే విధించే జరిమానాలలో కొన్ని..చూద్దాం..

Related posts