telugu navyamedia
ఆరోగ్యం

గ్యాస్, అసిడిటీ తో బాధ పడుతున్నారా …?

మ‌న‌లో చాలా మంది బాధ ప‌డుతున్న స‌మ‌స్య గ్యాస్,అసిడిటీ. మారుతోన్న కాలానికి అనుగుణంగా ఆహార శైలికూడా మారుతోంది. ఇంటి ఫుడ్‌కు ప్రాధాన్య‌త త‌గ్గుతుండ‌డం.. బ‌య‌ట ఫుడ్‌ఖు అల‌వాడు ప‌డ‌డం ఈ స‌మ‌స్య‌కు ప్ర‌ధాన కార‌ణ‌మ‌నే చెప్పొచ్చు. స్పైసీగా ఉన్న ప‌దార్ధాలు, కూల్ డ్రింగ్స్‌, పిజ్జా బ‌ర్గ్‌లు, బిర్యాలీను వంటి ప‌దార్థాలు వల్ల క‌డుపులో మంట‌, క‌డుపు ఉబ్బ‌రం, ఛాతినొప్పి వంటి స‌మ‌స్య‌లు చుట్టుముడుతుంటాయి.

Can You Overcome The Junk Food Cycle?

అయితే చాలా మంది గ్యాస్ స‌మ‌స్య వ‌చ్చింద‌టే చాలు లెక్క‌లేకుండా ట్యాబ్లెట్లు వేసుకుంటాం. అయితే ఇంట్లో దొరికి ప‌దార్థాల‌తోనూ గ్యాస్ స‌మ‌స్య నుంచి బ‌య‌ట‌ప‌డొచ్చ‌నే విష‌యం మీకు తెలుసా? స‌హ‌జ‌సిద్ధంగా గ్యాస్ స‌మ‌స్య‌కు చెక్ పెట్ట‌డానికి ఉప‌యోగ‌ప‌డే ఆహార ప‌దార్థాల గురించి ఓసారి చూద్దాం..

గ్యాస్ట్రిక్ ట్రబుల్‌ నుంచి ఉపశమనం పొందండిలా..

* ఆధునిక జీవనశైలి, మారిన ఆహారపు అలవాట్ల కారణంగా చాలా మంది గ్యాస్ ట్రబుల్‌తో ఇబ్బంది పడుతున్నారు. కడుపు ఉబ్బరంగా ఉండటం, ఆకలి లేకపోవడం, ఛాతిలో మంట మొదలైనవి గ్యాస్ ట్రబుల్ లక్షణాలు. పొట్టలోని ఆమ్లాలు ఎక్కువగా ఉత్పత్తి కావడం వల్ల ఈ సమస్య తలెత్తుతుంది.

* గ్యాస్ స‌మ‌స్య‌కు చెక్ పెట్ట‌డంలో ల‌వంగాలు కీల‌క పాత్ర పోషిస్తాయి. భోజనం త‌ర్వాత ఒక ల‌వంగాన్ని నోట్లో వేసుకుని న‌మ‌లాలి ఇలా చేస్తే గ్యాస్ త‌గ్గుతుంది.

* సోంపు గింజ‌ల‌ను నేరుగా తీసుకోవ‌డం కంటే.. వీటితో డికాష‌న్ చేసుకొని తీసుకుంటే మంచి ఫ‌లితం ల‌భిస్తుంది.

Coconut Water for Babies – TASTYGANICS.COM

* గ్యాస్ స‌మ‌స్య త‌గ్గించ‌డంలో కొబ్బ‌రి నీరు కూడా ముఖ్య‌పాత్ర పోషిస్తుంది. కొబ్బ‌రి నీళ్ల‌లో ఉండే ప్రోటీన్లు గ్యాస్ స‌మ‌స్య‌ను త‌రిమి కొడ‌తాయి.

* ఒక గ్లాసు నీటిలో టీస్పూన్ నిమ్మ‌ర‌సం, టీ స్పూన్ బేకింగ్ సోడాలను క‌లిపి ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్ తీసుకున్న త‌ర్వాత తాగాలి ఇలా చేయ‌డం వ‌ల్ల గ్యాస్ స‌మ‌స్య నుంచి తొంద‌ర‌గా బ‌య‌ట‌ప‌డొచ్చు.

* ఇక వీట‌న్నింటితో పాటు.. స‌మ‌యానికి తిన‌క‌పోయినా, మ‌సాలాలు, కారం ఎక్కువ‌గా ఉన్న ఆహారాన్ని తీసుకున్నా గ్యాస్ స‌మ‌స్య‌లు వ‌చ్చే అవ‌కాశాలున్నాయి. కాబట్టి వీటికి దూరంగా ఉండ‌డం మంచిది. అంతేకాకుండా.. ఒత్తిడి, ఆందోళ‌న కూడా గ్యాస్ స‌మస్య‌కు కార‌ణంగా మారొచ్చు.. కాబ‌ట్టి ఈ విష‌యాల్లో జాగ్ర‌త్త‌లు తీసుకుంటే గ్యాస్ స‌మ‌స్య‌కు చెక్ పెట్టొచ్చు.

Madhur's chicken tikka masala recipe : SBS Food

* వేళకు ఆహారం తీసుకోకపోవడం.. మానసిక ఒత్తిడి, సరిగా నిద్రపోకపోవడం, మసాలా ఆహారం కారణంగా గ్యాస్ సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. ఆహారం జీర్ణమయ్యేటప్పుడు పొట్టలో హైడ్రోజన్, మీథేన్ లేదా కార్బన్ డై ఆక్సైడ్ లాంటి వాయువులు ఉత్పన్నం అవుతాయి. అవి బయటకు వెళ్లకపోయినా, అధికంగా పేరుకుపోయినా పొట్టలో అసౌకర్యంగా అనిపిస్తుంది.

*. మనం తీసుకునే ఆహారం కూడా ఇందులో ముఖ్యపాత్ర పోషిస్తుంది. మసాలా ఫుడ్, కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండే బీన్స్, క్యాబేజీ, చక్కెర పదార్థాలు, పళ్ల రసాలు త్వరగా జీర్ణం కావు. అలాంటి ఆహారం జీర్ణమయ్యే క్రమంలో కడపులో వాయువులు విడుదలవుతాయి.

Related posts