telugu navyamedia
రాజకీయ

వైట్ హౌస్ లో జో బైడెన్ తో మోడీ సమావేశం

అమెరికా పర్యటనకు వెళ్లిన భారత ప్రధాని నరేంద్ర మోడీకి ఘన స్వాగతం లభించింది .
అమెరికా కాంగ్రెస్ ప్రతినిధి బడ్డీ కార్టర్ బృందం మోడికి స్వాగతం పలికారు . భారత ప్రధాని నరేంద్ర మోడీని ఆహ్వానించడం. తామెంతో గౌరవంగా భావిస్తున్నామని కార్టర్ తెలిపారు . ప్రపంచాన్ని కరోనా వణికించి తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ప్రధాని కోవిద్ నిబంధనలను పాటిస్తూ అమెరికాను సందర్శిస్తున్నారు.

ప్రధాని అమెరికాలో మూడు రోజుల పాటు పర్యటిస్తారు . అయితే కరోనా మహమ్మారి కారణంగా మోడీ పర్యటన లో ఎక్కువ మందిని కలిసే అవకాశం లేదు . వాషింగ్టన్‌లో మోడీ చాలా తక్కువ మందిని మాత్రమే కలవాలనుకుంటున్నారు . కోవిద్ నిబంధనల కారణంగా మోడీ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు .
నరేద్ర మోడీ ప్రధానిగా భాద్యతలు చేపట్టిన తరువాత అమెరికా లో మూడవ అధ్యక్షుడు జో బైడెన్ .

Image

గతంలో అమెరికా 44వ అధ్యక్షుడు బరాక్ ఒబామా తో నరేంద్ర మోడీ కి ఆత్మీయ అనుబంధం ఉండేది . ఒబామా జనవరి 20, 2009 నుంచి జనవరి 20 ,2017 వరకు అధ్యక్షుడు గా వున్నారు . భారత దేశం , అమెరికా పరస్పరం సహకరించుకున్నాయి . ఇద్దరు నాయకులు కూడా మైత్రితో పనిచేశారు .

Narendra Modi: Barack Obama thanks PM Narendra Modi for strengthening  Indo-US ties

ఇక అమెరికా 45వ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ జనవరి 20, 2017 నుంచి జనవరి 20, 2021 వరకు పనిచేశారు . ట్రంప్ మిగతా దేశాలతో ఎలా వున్నా భారత దేశంతో మాత్రం ఎంతో ఆత్మీయంగా వున్నారు . ముఖ్యంగా నరేంద్ర మోడీ అమెరికా సందర్శనకు వెళ్ళినప్పుడు అధ్యక్షుని ప్రోటోకాల్ పక్కనపెట్టి భారతీయులు నరేంద్ర మోడీ గౌరవార్ధం ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు .
అలాగే ట్రంప్ భారత పర్యటనకు వచ్చినప్పుడు కూడా మోడీ అమోఘమైన సస్వాగతం చెప్పాడు . ట్రంప్ , మోడీ స్నేహ బంధం ప్రపంచ పత్రికలు ప్రధానంగా రాశాయి .

ఇప్పుడు అమెరికా 46వ అధ్యక్షుడుగా జో బైడెన్ పదవీ బాధ్యతలను జనవరి 20న చేపట్టారు. జో బైడెన్ అధ్యక్షుడైన తరువాత భారత ప్రధాని మోడీ మొదటిసారి అమెరికాను సందర్శిస్తున్నారు . భారత , అమెరికా చిరకాల మైత్రిని దృష్టిలో పెట్టుకొని బిడెన్ శుక్రవారం రోజు నరేంద్ర మోడీని జో బిడెన్ తన అధికార నివాసం వైట్ హౌస్ కు ఆహ్వానించారు . మోడీ గౌరవార్ధం విందు ఏర్పాటుచేశారు .

ఈ సందర్భగా ఈ ఇద్దరు నాయకుల మధ్య రెండు దేశాలకు సంబంధించి పలు అంశాలు చర్చకు వచ్చే అవకాశం వుంది . భారత సంతతికి చెందిన ఉపాధ్యక్షురాలు కమలా హారీస్ గురువారం రోజు వైట్ హౌస్ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తో సమావేశం అయ్యే అవకాశం వుంది .అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ , భారత ప్రధాని నరేంద్ర మోడీ , జపాన్ , ఆస్ట్రేలియా అధ్యక్షులతో క్వాడ్ సమ్మిట్ లో పాల్గొంటారు , కోవిద్ తరువాత మొదటిసారి ఈ నాయకులు పాల్గొనే సమావేశానికి ఎంతో ప్రాధాన్యత వుంది . ఇక శనివారం రోజు ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ లో ప్రసంగించడానికి న్యూ యార్క్ వెడతారు. .

Image

 

Related posts