వినియోగదారులకు హక్కులు చాలా ముఖ్యమని తెలంగాణ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. బుధవారం తెలంగాణ వినియోగదారుల ఫోరం ఆరు జిల్లాల సమావేశానికి ముఖ్యఅతిధిగా ఎర్రబెల్లి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కల్తీ వస్తువుల విషయంలో సీఎం కీసీఆర్ చాలా సీరియస్‌గా ఉన్నారని అన్నారు.
ఇప్పుడు ప్రతి వస్తువు కల్తీ అయిపోతోందని తెలిపారు. పాలు విషయంలో కూడా ఇదే పరిస్థితి ఉంటోందన్నారు. కల్తీ లేని వస్తువులతోనే ఆరోగ్యమన్నారు. ఆరోగ్యంతోనే సమాజం బాగుంటుందని పేర్కొన్నారు. కల్తీ వస్తువులతో అందరూ ఆరోగ్యపరంగా, ఆర్థికంగా నష్టపోతారని తెలిపారు. అందరికీ కల్తీ లేని వస్తువులు అందేలా వినియోగదారుల ఫోరం పని చేయాలన్నారు.
దిశ తరహా ఘటనలు మళ్లీ జరుగకుండా చర్యలు చేపట్టాలి: కోదండరాం