telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

ఏపీలో ఈ రోజు ఎన్ని కేసులంటే..?

Covid-19

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది… గత బులెటిన్‌ కంటే తాజా బులెటిన్‌లో కొత్త కేసులు భారీగా పెరగగా.. ఇదే సమయంలో కోలుకున్నవారి సంఖ్య కూడా భారీగానే పెరిగింది… ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్‌ ప్రకారం.. రాష్ట్రంలో గత 24 గంటల్లో 3746 కొత్త పాజిటివ్ కేసులు నమోదు కాగా… 27 మంది మృతిచెందారు.. ఇదే సమయంలో 6,659 మంది కోలుకున్నారు. దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య 7,93,299 కు పెరిగింది. ఇప్పటి వరకు 6508కి మంది మృతిచెందారు.. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 32,376 గా ఉండగా.. కోలుకున్నవారి సంఖ్య 7,54,415 పెరిగింది. ఇక, గత 24 గంటల్లో 73,625 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. ఇప్పటి వరకు రాష్ట్రంలో నిర్వహించిన టెస్ట్‌ల సంఖ్య 64,94,099కి చేరింది. ఇక జిల్లాల వారీగా తీసుకుంటే అనంతపురంలో 301, చిత్తూరులో 437, తూర్పుగోదావరి జిల్లాలో 677, గుంటూరులో 396, కడపలో 166, కృష్ణాలో 503, కర్నూలులో 65, నెల్లూరులో 116, ప్రకాశంలో 127, శ్రీ కాకుళంలో 167, విశాఖపట్నంలో 138, విజయనగరంలో 134, పశ్చిమ గోదావరిలో 519 కేసులు నమోదయ్యాయి.

Related posts