telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు

రోహిణి కార్తె తో .. ఎండ తీవ్రత మరింతగా పెరిగింది.. జాగర్తలు పాటించాలంటున్న వైద్యులు..

temp

రోజురోజుకు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. ఎండల తీవ్రత తో రాష్ట్రం అగ్నిగుండంలా మారింది. రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రోహిణి కార్తె తొలిరోజు నుంచే మాడు పగిలేలా ఎండలు ఉన్నాయి. పగలు బయటకు వెళ్లొద్దని.. అత్యవసరమైతే తగు జాగ్రత్తలు తీసుకొని బయటకు వెళ్లాలని వైద్యులు సూచిస్తున్నారు.

ఎల్లుండి వరకు రాష్ట్రంలో తీవ్ర వడగాల్పులు వీస్తాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. సాధారణం కంటే 6 నుంచి 7 డిగ్రీలు ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ముఖ్యంగా రాష్ట్రంలోని ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం(44.8డిగ్రీలు) జిల్లాలు నిప్పుల కొలిమిలా మండిపోతున్నాయి. ఎండలు, వడగాడ్పులతో జనం రోడ్లమీదకు వచ్చేందుకు భయపడుతున్నారు. మధ్యాహ్నానికి రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి.

Related posts