telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

ఢిల్లీ ప్రజలకు .. మరో బంపర్ ఆఫర్ .. వైఫై ఫ్రీ..

kejriwal free wifi to delhi

ఢిల్లీ ప్రజలకు మరో బంపరాఫర్ ప్రకటించాడు కేజ్రీవాల్. గత నెలలో బస్సుల్లో మహిళలు టిక్కెట్లు లేకుండా ప్రయానం చేసే విధానానన్ని అమల్లోకి తెచ్చిన కేజ్రీవాల్ సర్కార్ ఇప్పుడు ఢిల్లీ ప్రజలకు ఉచిత వైఫై అందిస్తామంటోంది. ఢిల్లీవాసులకు ఉచిత పబ్లిక్ వైఫై అందించనున్నట్లు సీఎం కేజ్రీవాల్ తెలిపారు. ఢిల్లీలోమొత్తం 11 వేల హాట్ స్పాట్ సెంటర్లను ఓపెన్ చేయనున్నట్లు సీఎం చెప్పారు. నగరంలోని బస్ స్టాప్ లు దగ్గర 4వేలు,మార్కెట్లు దగ్గర 7వేల హాట్ స్పాట్ లు ఏర్పాటు చేస్తామన్నారు.డిసెంబర్ 16న మొదటగా 100 హాట్‌స్పాట్స్‌ను ఇన్‌స్టాల్ చేస్తామని, ఆ తర్వాత ప్రతి వారం 500 హాట్‌స్పాట్లను స్టార్ట్ చేస్తామని కేజ్రీవాల్ తెలిపారు. మొత్తం ఆరు నెలల్లో ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామన్నారు.

ఈ పథకం ద్వారా ఉచితంగా 1.5 జీబీ డేటా ఇవ్వనున్నట్లు కేజ్రీవాల్ తెలిపారు. దీంతో మ్యానిఫెస్టోలో ఉన్న చివరి వాగ్దానాన్ని నిలబెట్టుకున్నట్లు సీఎం కేజ్రీ చెప్పారు. ఈ స్కీమ్ విద్యార్థులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందన్నారు. మొత్తం వంద కోట్ల ఖర్చుతో ఈ ప్రాజెక్టును చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. దీని కోసం ప్రత్యేకంగా యాప్‌ ను తయారు చేసినట్లు సీఎం చెప్పారు. ప్రెస్టో అనే కంపెనీ ఈ ప్రాజెక్టును పరిశీలిస్తున్నట్లు తెలిపారు.

Related posts