telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ

ముందస్తు ప్రణాళికలో భాగంగానే బస్సుల నిలిపివేత

Tsrtc increase salaries double duty employees
హైదరాబాద్ నుంచి ఆంధ్ర ప్రదేశ్ లో అనేక ప్రాంతాలకు వెడుతున్న ప్రైవేట్ బస్సులను లైసెన్స్ పేరుతో రద్దు చెయ్యడంలో 
కేసీఆర్ సర్కార్ ప్రమేయం ఉందని తెలుస్తుంది . గత పది రోజుల క్రితం ఆంధ్ర కు వెళ్లే  తెలంగాణ ఆర్ . టి .సి  బస్సులను  ఏప్రిల్  10 , 11 తేదీల్లో నిలిపివెళ్లాలనే ఆదేశాలు వెళ్లినట్టు విశ్వసనీయంగా తెలిసింది . 
11 వతేదీన ఆంధ్ర ప్రదేశ్లో శాసన సభ , పార్లమెంట్ కు ఎన్నికలు జరిగే నేపథ్యంలో  జంట నగరాల నుంచి వేలాది మంది తరలి వెడతారు  , అలావెళ్లే వారు ఎక్కువ శాతం తెలుగు దేశానికి వోట్ వేస్తారని , అందుకే వారు వెళ్లకుండా ఉండాలనే బస్సులు నడపకూడదని ఆదేశాలు  ఇచ్చినట్టు తెలుస్తుంది . 
అయితే తెలంగాణ  ఆర్ . టి .సి  బస్సులను ఆపితే … కావాలని ఆపివేశారని … దీనిని రాజకీయ కుట్రలో భాగంగా అభివర్ణించి కేసీఆర్ ను బద్నాం చెయ్యవచ్చునని భావించారు . అందుకే బాగా అలోచించి   దీనికి ప్రత్యామ్నాయంగా  ప్రైవేట్ బస్సు లను ఆపివేయాలని ప్లాన్ చేశారు . చివరి నిముషం వరకు దీనిని అత్యంత గోప్యంగా ఉంచారు . దీంతో ప్రైవేట్ బుస్సులులో అయితే సురక్షితంగా గమ్యాలకు చేరుతామని భావించిన ప్రయాణికులు ప్రభుత్వ తీరుతో నివ్వెరపోయారు . ఎలా వెళ్ళాలో తెలియక అయోమయంలో పడిపోయారు .
అలాగే తెలంగాణ లో కూడా ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి హైదరాబాద్ నుంచి ఆంధ్ర ప్రదేశ్కు వెళ్లే బస్సులను చాలావరకు తెలంగాణ జిల్లాలకు మరలించినట్టు తెలిసింది . ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడును మళ్ళీ అధికారంలోకి రాకుండా చెయ్యడానికి తెలంగాణ సర్కారు  తెర  వెనుక క్రియాశీలకంగా వ్యవహరిస్తుందని చెప్పడానికి  ఇంతకంటే ఉదాహరణ అవసరం లేదు . కేసీఆర్  వ్యూహం ఎలా కూడా ఉంటుందా ” అని ఈ వార్త తెలిసిన ప్రజలు ముక్కు మీద వేలు వేసుకుంటున్నారు . 

Related posts