అల్లరి నరేశ్ ఇటీవల విడుదలై భారీ విజయాన్ని అందుకున్న “మహర్షి” చిత్రంతో మళ్ళీ ఫామ్ లోకి వచ్చాడు. తాజా ఇంటర్వ్యూలో “అల్లరి” నరేశ్ మాట్లాడుతూ, తన జీవితంలో తాను ఎప్పటికీ మరిచిపోలేని రోజు ఒకటి ఉందంటూ ఇలా చెప్పుకొచ్చాడు. “అవి నేను ‘సీమటపాకాయ్’ చేస్తోన్న రోజులు. మరో రెండు మూడు రోజులు షూటింగ్ చేస్తే అయిపోతుంది. పెద్ద పెద్ద ఆర్టిస్టుల కాంబినేషన్లో సీన్లు చేస్తున్నారు. అప్పటికే హాస్పిటల్లో వున్న నాన్న పరిస్థితి మరింత సీరియస్ అవుతోందని తెలుస్తోంది. ఇక్కడ సెట్లో నేను కామెడీ సీన్స్ చేయవలసిన పరిస్థితి. షూటింగ్ వాయిదా వేయడానికి లేదు. ఆర్టిస్టుల డేట్స్ లేవు. అందువలన అలాగే షూటింగు పూర్తి చేసి వెళ్లాను. 2011 జనవరి 21వ తేదీన మా నాన్నగారు చనిపోయారు. ఆ బాధ నుంచి నేను బయటపడటానికి మా బాబాయి ‘గిరి’ కారణమనే చెప్పాలి. కానీ 2013 జనవరి 21వ తేదీనే ఆయన కూడా చనిపోయారు. అప్పటి నుంచి జనవరి 21వ తేదీ వస్తుందంటేనే నాకు చాలా భయంగా అనిపిస్తూ ఉంటుంది” అని చెప్పుకొచ్చాడు.
previous post
తేజ్ ప్రమాదం కాదు .. వివేకా హత్య గురించి మాట్లాడండి