2019 ఐసీసీ ప్రపంచకప్‌లో భాగంగా ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా పాక్ తో ఇంగ్లండ్ తలపడుతున్నాయి. ఆతిధ్య జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే లీగ్ దశలో సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లోనూ అదే జోరును కొనసాగించాలని ఆతిథ్య జట్టు భావిస్తోంది.
వెస్టిండీస్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో చిత్తుగా ఓటమిపాలైన పాక్ ఈ మ్యాచ్‌లో విజయం సాధించి పరువు దక్కించుకోవాలని అనుకుంటోంది. ఈ మ్యాచ్‌లో పాక్ రెండు మార్పులతో బరిలోకి దిగుతోంది. హరీస్ సోయల్, ఇమామ్ వాసిం స్థానంలో షోయబ్ మాలిక్, ఆసిఫ్ అలీలలను జట్టులోకి తీసుకుంది. ఇక ఇంగ్లండ్ ఈ మ్యాచ్‌లో ఒక మార్పు చేసింది. లైమ్ ప్లంకెట్ స్థానంలో మార్క్ వుడ్‌ని జట్టులోకి తీసుకుంది.