కార్తీ హీరోగా లోకేశ్ కనగరాజ్ తెరకెక్కించిన చిత్రం “ఖైదీ”. డ్రీమ్ వారియర్స్ పిక్చర్స్, వివేకానంద పిక్చర్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకి సామ్ సీఎస్ ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్. ఈ చిత్రంలో హీరోయిన్, పాటలు ఏమి లేకుండా అద్భుతంగా నడిపించారు. పక్కా మాస్ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో కార్తీ యావజ్జీవ శిక్ష పడిన ఖైదీగా కనిపించారు. తండ్రీకూతుళ్ల సెంటిమెంట్ ఈ సినిమాకి మరో హైలైట్. పాజిటివ్ టాక్‌తో దూసుకెళుతూ మంచి కలెక్షన్స్ సాధిస్తున్న ఈ చిత్రానికి సంబంధించి తాజాగా చిత్ర బృదం “ఖైదీ” హైలైట్ సీన్స్ అంటూ ఓ వీడియో విడుదల చేసింది. ఇందులో సినిమా హైలైట్ సీన్స్ ఉన్నాయి. మరి ఆ హైలైట్ సీన్స్ ఏంటో మీరు కూడా వీక్షించండి.
previous post