ఆదివారం సాయంత్రం ప్రముఖ నటుడు, యాక్షన్ కింగ్ మేనల్లుడు చిరంజీవి సర్జా అనారోగ్యంతో మరణించిన సంగతి తెలిసిందే. చిరంజీవి ఆకస్మిక మరణంతో ఆయన అభిమానులు షాక్‌కు గురయ్యారు. మరోవైపు పలువురు సెలబ్రిటీలు స్పందిస్తూ చిరంజీవి సర్జా మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే రచయిత్రి శోభా డే చేసిన ట్వీట్ చర్చనీయాంశంగా మారింది. చిరంజీవి సర్జా మరణం పట్ల సంతాపం వ్యక్తం చేయడంలో భాగంగా పెద్ద పొరపాటు చేశారు రచయిత్రి శోభా డే. ఆయన మృతిపై ట్విట్టర్‌లో శ్రద్దాంజలి ఘటిస్తూ.. మరో యువ నటుడు ఈ లోకం నుంచి వెళ్లిపోయారని, ఈ విషాద కరమైన వార్త షాక్ గురించి చేసిందని అన్నారు. ఆయన మరణం పూడ్చలేనిదని పేర్కొంటూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలుపుతున్నానని పోస్టు పెట్టారు. ఇంతవరకూ బాగానే ఉన్నా ఈ ట్వీట్‌లో చిరంజీవి సర్జా ఫోటోకు బదులుగా మెగాస్టార్ చిరంజీవి ఫోటో పెట్టడంతో మెగా అభిమానులు ఆమెపై సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడుతున్నారు.
previous post