telugu navyamedia
సినిమా వార్తలు

వినోద్ ను దూరం పెట్టిన “జబర్దస్త్” టీం… ఎందుకంటే ?

Vinod

ఈ మధ్య వివాదాలతోనే ఎక్కువగా వార్తల్లో కనిపిస్తున్నాడు జబర్దస్త్ వినోద్. ఇక ఈ మధ్యే ఈయన ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను ఎందుకు జబర్దస్త్‌కు దూరం కావాల్సి వచ్చిందో కారణం చెప్పాడు వినోద్. తనను జగన్ పాదయాత్ర కోసమో, లేదంటే మరో కారణాల కోసమే పక్కనబెట్టలేదని, ఇచ్చిన డేట్స్‌ను తామే సరిగ్గా యూజ్ చేసుకోలేదని, అందుకే తనను జబర్దస్త్ నుంచి దూరం పెట్టేసారని చెప్పుకొచ్చాడు వినోద్. అంతేకానీ అందులో జబర్దస్త్ డైరెక్షన్ టీం ఏం తప్పు చేయలేదని చెప్పాడు వినోద్. స్క్రిప్ట్ అంతా తమపై రాసుకున్నపుడు తాము వదిలేసి వెళ్లడంతో వాళ్లకు కోపం రావడంలో న్యాయం ఉంది కదా అంటున్నాడు వినోద్. దాంతో టీమ్ లీడ‌ర్స్ తమ స్థానాన్ని భ‌ర్తీ చేయ‌లేక‌పోయార‌ని.. ఇబ్బందులు ప‌డ్డార‌ని గుర్తు చేసుకున్నారు. దాంతో జ‌బ‌ర్ద‌స్త్ డైరెక్ష‌న్ టీం ఇంకెవ‌రూ ఇలా చేయ‌కూడద‌ని తనపై నిషేధం విధించార‌ని గుర్తు చేసుకున్నాడు వినోద్. త‌మ‌ను నమ్ముకుని స్కిట్లు రాసుకున్నపుడు ఇలా వదిలేసి వెళ్లడం త‌ప్ప‌ని తెలిసేలా చేసార‌న్నాడు ఈయన. త్వరలోనే తాను మళ్లీ జబర్దస్త్ షోకు రీ ఎంట్రీ ఇస్తానని చెబుతున్నాడు వినోద్.

Related posts