శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే రేపు మహారాష్ట్ర సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇందుకోసం ముంబైలోని తన తండ్రి సమాధి ఉన్న ప్రఖ్యాత శివాజీ పార్కులో రేపు సాయంత్రం 6.40 గంటలకు ఈ కార్యక్రమం జరుగనుంది. ప్రమాణస్వీకార కార్యక్రమానికి శివాజీ పార్కు మైదానంలో ఏర్పాట్లు కొనసాగుతున్నాయి.
పార్కు మైదానాన్ని చదును చేయడంతోపాటు అటువైపు వెళ్లే మార్గం వెంబడి యంత్రాల సాయంతో మరమ్మత్తు పనులు చేపడుతున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా, సోనియా గాంధీని శివసేన నేతృత్వంలోని కూటమి అహ్వానించింది. మహారాష్ట్ర నలుమూలల నుంచి 400 మంది రైతులకు కూడా ఆహ్వానాలను పంపింది.