telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

నా గొడకున్న గడియారం….!

నాలో ఉన్న గతిని
గమనిస్తూనే ఉంటుంది !
అలసత్వాన్ని
గుర్తు చేస్తూనే
మాటలకూ
చెసే పనులలొ
ఆపుదలకు తోడుగా ఉంటుంది !
నాకు సమయమేమిటో
సందర్బమెమిటో అనే
విషయాన్ని అలొచన
చేసేలా చేస్తుంది
నా గతి యంత్రం
నా గొడకున్న గడియారం….!
నిశబ్ద నిద్రలో ఉన్నా
నిస్తేజంగా నీడలో ఉన్నా
నాకు నా గతిని గమనించి
టిక్కు టిక్కు అంటు సబ్ధాలు
ప్రతి ఘడియలులో మొగె
గంటలు నన్ను ఉత్తేజకరంగా
మార్చాలని ప్రయత్నం చేస్తూ ఉంటుంది
నా గతి యంత్రం
నా గొడకున్న గడియారం !

Related posts