telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సంక్రాంతి బరిలో నిలిచిన “క్రాక్‌” మూవీ

Krack

సంక్రాంతి సందర్బంగా విడుదలైన క్రాక్ సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా రవితేజా అందరని అలరించారు. ఈ సినిమా విడుదల రోజు కాస్త ఆలస్యం అయినా బొమ్మ మాత్రం అదిరిపోయింది. చాలా కాలం తరువాత రవితేజా ఫుల్ మీల్స్ లాంటి సినిమా చేశాడని అభిమానలు సంతృప్తి చెందారు. ఈ సినిమాతో గోపీచంద్, రవితేజా కాంబో హ్యాట్రిక్ చేసింది. వీరి కాంబోలో వచ్చిన మూడు సినిమాలు హిట్ అయ్యాయి. పోటీగా విడుదైన రామ్ ‘రెడ్’, విజయ్ ‘మాస్టర్’, బెల్లంకొండ శ్రీనివాస్ ‘అల్లుడు అదుర్స్’ చిత్రాలని తోసి క్రాక్‌ను ఫస్ట్‌ ప్లేస్ లో నిలవటం విశేషం. అయితే రవితేజకు ఇలా సంక్రాంతి విజేతగా నిలవటం ఇది తొలిసారి కాదు. గతంలోనూ 2008, 2011లో కూడా సంక్రాంతికి వచ్చిన సినిమాలను బీట్ చేస్తూ విజేతగా నిలిచాడు. 2011 సంక్రాంతి బాలకృష్ణ ‘పరమవీర చక్ర, సిద్ధార్గ్ ‘అనగనగా ఓ ధీరుడు’ సుమంత్ ‘గోల్కొండ హైస్కూల్’తో పాటు రవితేజ ‘మిరపకాయ్’ సంక్రాంతి కానుకగా విడుదలయ్యాయి. వీటన్నింటిలో ‘మిరపకాయ్’ ఘాటెక్కిస్తూ ఆ ఏడాది సంక్రాంతి విజేతగా నిలిచింది. ఇక 2008 సంక్రాంతికి వచ్చిన బాలకృష్ణ ‘ఒక్క మగాడు’, సంక్రాంతి రాజుఎమ్మెస్ రాజు దర్శకత్వంలో రూపొందిన ‘వాన’, సుమంత్ ‘పౌరుడు’ తో పోటీ పడ్డ రవితేజ ‘కృష్ణ’ సందడి సందడి చేసి విన్నర్ అనిపించుకోవడం విశేషం. ఇలా మూడు సార్లు విజేతగా నిలిచిన రవితేజ 2010 సంక్రాంతికి వెంకటేశ్ ‘నమో వెంకటేశ’, నవదీప్ ‘ఓం శాంతి’, జూనియర్ ‘అదుర్స్’తో ‘శంభో శివశంభో’ అంటూ పోటీ పడ్డాడు. అయితే ఎన్టీఆర్ విన్నర్ గా నిలవగా… రవితేజ మాత్రం రన్నర్ గా నిలవటం విశేషం. అంతే కాదు 2003లో కూడా ‘ఈ అబ్బాయి చాలామంచోడు’తో పర్వాలేదనిపించుకున్నాడు. ఆ ఏడాది ‘ఒక్కడు’తో మహేశ్ బ్లాక్ బస్టర్ కొట్టడా… ఫ్యామిలీ ఆడియన్స్ ‘పెళ్ళాం ఊరెళితే’ సంబరాలు చేసేసుకున్నారు.

Related posts