telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

కరోనా వ్యాక్సిన్‌ను అందుకే తీసుకోలేదు : ఈటల

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ప్రారంభంమైంది. వర్చువల్‌ విధానంలో ప్రధాని మోడీ కరోనా టీకా ప్రక్రియను ప్రారంభించిన అనంతరం హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి, రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ కలిసి ప్రారంభించారు. అయితే…గాంధీ ఆస్పత్రిలో సఫాయి కర్మచారి కృష్ణమ్మ మొదటి టీకా వేసుకుంది. టీకా వేసుకున్న మొదటి వ్యక్తిగా కృష్ణమ్మ రికార్డుల్లోకి ఎక్కింది. ఈ సందర్భంగా ఈటల మాట్లాడారు. ICMR గైడ్ లెన్స్ ప్రకారమే కరోనా బాధితులకు వైద్యం అందించామని ఈటల పేర్కొన్నారు. ప్రపంచానికి వ్యాక్సిన్ మన దేశం అందించడం గర్వకారణమన్నారు. కరోనా వ్యాక్సిన్ పంపిణీ నిరంతర ప్రక్రియ అని పేర్కొన్నారు. “ప్రాణాలకు తెగించి డాక్టర్స్, నర్సులు, శానిటేషన్ సిబ్బంది కరోనా పై యుద్ధం చేశారు. ప్రాణ త్యాగం కూడా చేశారు. వారిని గుర్తు చేసుకొని ప్రధాని భావోద్వేగానికి గురయ్యారు. వారికి ముందు వాక్సిన్ అందించాలని ప్రధాని సూచించారు. మొదటి వాక్సిన్ సఫాయి కర్మచారికే ఇచ్చాము. అందుకే నేను ఈ రోజు వాక్సిన్ తీసుకోలేదు. ” అని మంత్రి ఈటల పేర్కొన్నారు.

Related posts