telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

భారీగా రేటు పెంచిన వర్మ హీరోయిన్‌…

టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇటీవల “నగ్నం” అనే సినిమాను ఓటీటీలో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. వర్మ ఈ సినిమా ద్వారా శ్రీ రాపాక అనే బ్యూటీని హీరోయిన్‌గా పరిచయం చేశాడు. పూర్తి బోల్డ్ కంటెంట్ సినిమాగా వచ్చిన ‘నగ్నం’లో ఆమె అందాల ఆరబోతకు కుర్రకారు మతులు పోయాయి. ఈ లఘు చిత్రం మొదటి 12 గంటలలో 70 లక్షల రెవెన్యూ తీసుకొచ్చింది. ఇక తొలి 20 గంటల్లో ఏకంగా 35445 పెయిడ్ వ్యూస్ వచ్చాయి.  అయితే… శ్రీ రాపాక ఈ మధ్యలో ఎక్కువగా ఇంటర్వ్యూల్లో పాల్గొంటుంది. తొలి చిత్రానికి 1.2 లక్షలు మాత్రమే తీసుకున్నానని ఇప్పటికే పలు ఇంటర్వ్యూల్లో చెప్పింది ఈ బ్యూటీ. ప్రస్తుతం ఆమె వరుసగా మూడు చిత్రాలకు సంతకాలు చేసింది. ఈ సినిమాలకు ఏకంగా 10 లక్షలు తీసుకుంటుంది. రాపాక నటిస్తున్న మరో చిత్రం “కాత్యాయని”. ఈ సినిమా కోసం కూడా రాపాకకు భారీగానే ముట్టజెప్పుతున్నారని గుసగుసలు వినిపిస్తునాయి. ఇంకా సినిమాలు వస్తే…రేటు మరింత పెంచాలని భావిస్తుందట ఈ భామ. 

Related posts