telugu navyamedia
సినిమా వార్తలు

ఆక‌ట్టుకున్న చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ ల స్నేహం..!

కౌన్ బనేగా క్రోర్‌పతి తెలుగు వెర్షన్ “ఎవరు మీలో కోటీశ్వరులు” షో మొదటి ఎపిసోడ్ ఆదివారం ప్రసారమైంది. జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించిన ఈ షోకు కర్టెన్ రైజర్ ఎపిసోడ్‌లో మొదటి అతిథిగా రామ్ చరణ్ వచ్చారు. హిందీలో బిగ్‌బి అమితాబ్ బచ్చన్ హోస్ట్ చేస్తున్న కౌన్ బనేగా క్రోర్‌పతి ఎంతటి పాపులర్ షోగా మారిందో అందరికీ తెలుసు. ఆ కార్యక్రమం లాంటిదే తెలుగులో ప్ర‌చారం అవుతుంది. ఊహించినట్లుగానే ఎన్టీఆర్, రామ్ చరణ్ సూట్‌లు ధరించి స్మాషింగ్, కిల్లర్ లుక్ హ్యాండ్సమ్ గా కన్పించారు.

షోలో ముందుగా షో లో రామ్ చరణ్ ఆరెంజ్ సినిమా నుంచి సిడ్నీ నగరం సాంగ్ ని పాడి వినిపించాడు. అద్భుతంగా పాడారు అని ప్రశంసలు కురిపించిన ఎన్టీఆర్ త్వరలోనే ఒక సినిమాలో కూడా పాడాలని కోరారు. ఖచ్చితంగా అవకాశం వస్తే పాడతానని రామ్ చరణ్ చెప్పుకొచ్చాడు. ఎన్టీఆర్ డ్రెస్ ను చరణ్ సర్దడం చూస్తుంటే “ఆర్ఆర్ఆర్”తో వారిద్దరి మధ్య స్నేహం మరింత పెరిగిందని అన్పిస్తుంది. తారక్ చరణ్‌తో “మీరు నా జీవితంలో నాకు తెలిసిన అత్యంత మంచి వ్యక్తి, బెస్ట్ ఫ్రెండ్” అని చెప్పడం దీనికి మరో నిదర్శనం.

Corona Virus Preventive Measures - NTR, Ram Charan | COVID-19 - YouTube

. అయితే ఎన్టీఆర్ ఈ షోలో చరణ్ ను చాలా సులువైన ప్రశ్నలు అడిగాడు. ఇక ప్రశ్నల మధ్యలోనే చాలా ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ఒక ప్రశ్నలో భాగమా రామ్ చరణ్ తన తండ్రితో తన సంబంధాన్ని పంచుకున్నాడు. “నా తండ్రి నాకు ఇంట్లో కూడా ఆచార్య” అని చెప్పగా “చిరంజీవి గారు నాకే కాదు మొత్తం పరిశ్రమకు ఆచార్యులు. చిన్నప్పటి నుండి అతడిని చూసి నేర్చుకోవడం నన్ను ఈ స్థాయికి తీసుకువచ్చింది” అని తారక్ అన్నారు.

Ram Charan's RRR costar Jr NTR shares PHOTO & sends him wishes; Says he  will cherish moments spent with him | PINKVILLA

అలాగే చిరంజీవితో “ఆచార్య” సినిమా షూటింగ్ అనుభవాలు చెప్పమని జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ ని అడిగాడు. అయితే తనకు మామూలుగానే షూటింగ్ కి వెళ్లడం అంటే కొంచెం టెన్షన్ గా ఉంటుందని అలాంటిది నాన్నగారితో షూటింగ్ కి వెళ్లడం అంటే ప్రిన్సిపాల్ తో కూర్చుని పరీక్షలు రాస్తున్నట్లు అనిపించింది అని అన్నాడు.

RRR team begins recce in Nalgonda, remainder of film to be shot in and  around Hyderabad - Hindustan Times

అయితే తాము పడ్డ కష్టమంతా తెరమీద కచ్చితంగా కనిపిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. “ఆచార్య” గురించి ఆసక్తిగా ఎదురు చూస్తున్నామని ఎన్టీఆర్ అన్నాడు. ఇంకా ఈ షోలో “ఆర్ఆర్ఆర్” గురించి కూడా ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.  మళ్లీ ఈ రోజు జ‌ర‌గ‌బోయే  ఎపిసోడ్ కొనసాగుతుంది. రామ్ చరణ్ ఇంకా గేమ్ ఆడుతున్నాడు. తదుపరి ఎపిసోడ్‌లో రానా దగ్గుబాటితో ఇంటరాక్ట్ అవుతాడు.

Related posts